Telugu Politics: ఎంపీ × పోలీస్ – ఏపీలో ఈయన.. తెలంగాణలో ఆయన!

Share

Telugu Politics: ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ రఘురామకృష్ణంరాజు, తెలంగాణలో లోక్ సభ సభ్యుడు రేవంత్ రెడ్డిల పట్ల ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే పార్లమెంటు సభ్యులకు వీసమెత్తయినా విలువ లేదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది!ఏపీలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏకంగా సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది!రఘురామ కృష్ణంరాజును ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి హుకుం మేరకే అరెస్టు చేసినట్లు అందరూ భావిస్తున్నారు .

clash between mp and police in both telugu states
clash between mp and police in both telugu states

తెలంగాణాలో కరోనా సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధపడ్డ మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ని అడ్డుకోమని సీఎం కేసీఆర్ తనయుడు ,ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆదేశాలు ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.ఒకే సమయంలో రెండు తెలుగు రాష్ర్టాల్లో లోకసభ సభ్యులకు ఎదురవుతున్న ఈ చేదు అనుభవాలు కొత్త చర్చకు దారి తీస్తోంది.ఎంపీలకేఈ పరిస్థితి ఎదురవుతుంటే సామాన్యుడి మాటేమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Telugu Politics: ఆర్ ఆర్ ఆర్ అరెస్టు ఫ్లాష్ బాక్ ఇదీ!

ఏడాది కాలంగా వైసీపీకి దూరంగా ఉన్న ఎంపీ ఆర్ఆర్ఆర్ అనేక సందర్భాల్లో జగన్ ప్రభుత్వ విధానాలను ,వైఫల్యాలను ఎత్తి చూపడం జరిగింది.అయితే అకస్మాత్తుగా ప్రభుత్వం రెండు రోజుల క్రితం రియాక్ట్ అయింది. సీఐడీ పోలీసులు ఫిర్యాదు అందింది .ఆయన పుట్టినరోజు నాడే ఆర్ఆర్ఆర్ ని అరెస్టు చేశారు.వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఎందుకు అరెస్టు చేయల్సి వచ్చిందో..తదితర కారణాలను ఏపీ సీఐడీ వెల్లడించింది. ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఎంపీ రఘురామకృష్ణంరాజును హైదరాబాద్‌లో అరెస్టు చేయడం జరిగిందని, వర్గాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని తెలిపింది.సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారని, మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఏపీ సీఐడీ అధికారులు తెలిపారు. రఘురామపై ఐపీసీ 124ఏ, 153ఏ, 505 ఆర్/డబ్ల్యూ, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపింది.

Telugu Politics: రేవంత్ రెడ్డిని రౌండప్ చేసిన పోలీసులు!

గాంధీ ఆస్పత్రి దగ్గర ఉన్న పేదలకు అన్నదానం చేసేందుకు వెళ్తున్న ఎంపీ రేవంత్ రెడ్డిని బేగంపేటలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో రేవంత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. మంత్రి కేటీఆర్ నుంచి ఆదేశాలు ఉన్నాయని, అందుకే ఆయనను అనుమతించలేమని పోలీసులు చెప్పారు. రేవంత్ రెడ్డి వాహనం ముందుకు వెళ్లకుండా పోలీసులు రౌండప్ చేశారు. దాంతో రాతపూర్వక ఆదేశాలు చూపాలని రేవంత్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదోడి ఆకలిపై రాజకీయాలు చేస్తారా? సిగ్గుందా కేటీఆర్ అని దుయ్యబట్టారు. లాక్ డౌన్ టైంలో పేదలకు పట్టెడు అన్నం పెట్టడం నేరమా అని క్వశ్చన్ చేశారు. తాను స్థానిక ఎంపీనని, తనను అడ్డుకోమని చెప్పే అధికారం ఎవరిచ్చారనీ ఫైర్ అయ్యారు. సామాజిక సేవలోనూ రాజకీయాలు వెతికే ప్రయత్నం దుర్మార్గమని విమర్శించారు.

 


Share

Related posts

Jetti Movie: జెట్టీ సినిమా మొదటి పాటను విడుదల చేసిన వేణు ఉడుగుల..!!

bharani jella

బ్యాంకు వినియోగదారులకు శుభవార్త… రూపాయికే బైక్..!

Teja

బాబు తరహా రాజకీయానికి తాజా ఉదాహరణ!

CMR