ట్రెండింగ్ న్యూస్

Jabardasth : హైపర్ ఆది, రైజింగ్ రాజుకు పడట్లేదా? అందుకే స్కిట్లలో కావాలని గొడవ పెట్టుకుంటున్నారా?

clash between raising raju and hyper aadi in jabardasth show
Share

ప్రస్తుతం జబర్దస్త్ లో ఎక్కువ క్రేజ్ ఉన్నది హైపర్ ఆదికే. హైపర్ ఆది స్కిట్ వస్తే చాలు.. అందరూ పగలబడి నవ్వుతారు. ఆది కామెడీ టైమింగ్ అలా ఉంటుంది మరి. ప్రస్తుతం జబర్దస్త్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న కంటెస్టెంట్ అంటే హైపర్ ఆదినే. నిజానికి.. హైపర్ ఆది, రైజింగ్ రాజు.. ఇద్దరిని కలిపి టీమ్ గా ఏర్పాటు చేసినా.. హైపర్ ఆదికి వచ్చినంత పాపులారిటీ.. రైజింగ్ రాజుకు రాలేదు.

clash between raising raju and hyper aadi in jabardasth show
clash between raising raju and hyper aadi in jabardasth show

ఆ మధ్య చాలా స్కిట్లలోనూ రైజింగ్ రాజు కనిపించలేదు. కొన్నిసార్లు కేవలం హైపర్ ఆది పేరుతోనే స్కిట్లు నడిపించారు. తర్వాత మళ్లీ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్ అని అంటున్నారు. రైజింగ్ రాజు మళ్లీ వచ్చి హైపర్ ఆది స్కిట్ లోనే చేస్తున్నాడు. నిజానికి ఇద్దరూ టీమ్ లీడర్లే కానీ.. అక్కడ డామినేషన్ మాత్రం ఒక్క హైపర్ ఆదిదే.

ఆది ఏది చెబితే మిగితా వాళ్లు అది చేయాలి. ఎక్కువ డైలాగులు ఉండేది ఆదికే. ఎక్కువగా పంచ్ లు వేసేది ఆదినే. మిగితా కంటెస్టెంట్లంతా ఏదో ఆయనకు సపోర్ట్ ఇవ్వడం కోసం వస్తారు అంతే. మరో టీమ్ లీడర్ అయిన రైజింగ్ రాజు పరిస్థితి కూడా అలాగే ఉంది. టీమ్ లీడర్ అయినా కూడా తనను పట్టించుకోవడం లేదంటూ రైజింగ్ రాజు.. హైపర్ ఆది మీద కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది.

అందుకే.. స్కిట్లలోనే హైపర్ ఆదిపై తనకు ఉన్న కోపాన్ని చూపిస్తున్నాడని అంటున్నారు. హైపర్ ఆది కూడా రైజింగ్ రాజుపై స్కిట్లలో నిజంగానే తిడుతున్నట్టుగా, కోపంగా మాట్లాడుతున్నట్టుగా చేస్తున్నాడు. వాళ్ల మాటలు చూస్తుంటే నిజంగానే వాళ్ల మధ్య మనస్పర్థలు వచ్చినట్టున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా విడుదలైన జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలోనూ అదే చూడొచ్చు. నన్ను టీమ్ లీడర్ అని అనాల్సిన చోట అనవు కానీ.. అనవసరమైన సమయంలో అంటావు.. అంటూ రైజింగ్ రాజు.. హైపర్ ఆదిపై బాగానే సీరియస్ అయ్యాడు. దానికి సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసేయండి మరి..


Share

Related posts

December: మీరు డిసెంబర్ లో పుట్టారా? అయితే ఇది మీకోసమే!!

Kumar

Corona Vaccine: ఏపికి చేరుకున్న మరో 1.92లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు..!!

somaraju sharma

Breaking News: మైనర్ బాలిక ప్రేమించడం లేదని నాటు తుపాకీతో కాల్చాడు – చిత్తూరు జిల్లాలో ఘటన..!!

Srinivas Manem
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar