Bigg Boss 5 Telugu: సిరి.. షణ్ముఖ్ మధ్య చిచ్చుపెట్టిన బిగ్ బాస్..??

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Big boss) హౌస్ లో వాతావరణం ఎప్పటికప్పుడు మారిపోతుంది. ఊహించని ట్విస్ట్ లతో ఇంటి సభ్యులతో బిగ్ బాస్ ఆడేసుకుంటున్నారు. ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో.. కెప్టెన్ షణ్ముక్(Shanmukh) మినహా మిగతా ఇంటి సభ్యులు నామినేట్ కాగా.. ఆ తర్వాత స్పెషల్ పవర్ తో..యాని(Yaani) మాస్టారు తర్వాత మానస్.. ఎలిమినేషన్ నామినేషన్ నుండి తప్పించుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఇంటిలో ఉన్న సభ్యులను రెండు గ్రూపులుగా బిగ్బాస్ విభజించటం జరిగింది. విలన్స్, హీరోస్ గా విభజించబడిన ఈ రెండు జట్ల మధ్య పోటాపోటీ వాతావరణం.. నువ్వానేనా అన్నట్టుగా బిగ్ బాస్(Big boss) టాస్క్ లు ఇస్తున్నారు. రవి(Ravi), యానీ(Yaani), సన్నీ(Sunny), విశ్వ(Vishwa), జెస్సీ(Jessy) విలన్స్‌ టీమ్‌లో ఉండగా మిగిలినవారంతా హీరోస్‌ టీమ్‌లో ఉన్నారు. విలన్స్‌ టీమ్‌ వాళ్లను ఎమోషనల్‌గా దెబ్బ తీయాలని ప్లానులు రచిస్తున్నారు హీరోస్ టీం సభ్యులు. హీరోస్ టీం లో ఉన్న షణ్ముక్ తనదైన శైలిలో ప్లాన్లు వేస్తూ… విలన్ టీమ్స్ లో ఉన్న కీలక కంటెస్టెంట్ లను టార్గెట్ చేస్తున్నాడు. రవి అదేరీతిలో విశ్వ, సన్నీ లను టార్గెట్ చేసుకుని షణ్ముక్ సరికొత్త ప్లాన్ వేస్తున్నాడు. ఈ క్రమంలో గేమ్ మధ్యలో సిరి కి షణ్ముఖ్ కి మధ్య… గొడవ చేసుకోవడం జరిగింది. టాస్క్ ఆడుతున్న సమయంలో.. తనని నిర్ధాక్షణ్యంగా.. తో చేశారని సిరి గొడవకు దిగడంతో.. వెంటనే షణ్ముఖ్ జస్వంత్ ప్రతి చిన్నదానికి గొడవకు దిగి..అతి చేయొద్దు అని గట్టిగా అరవడం జరిగింది.

Bigg Boss Telugu 5: Shanmukh avoids BFF Siri; here's what netizens think about their brewing conflict - Times of India

దీంతో సిరి గేమ్ మధ్యలో.. బాధపడి ఏడవడం జరిగింది ఇద్దరి మధ్య ఈ తరుణంలో డిస్కషన్లు కూడా జరగడంతో నువ్వానేనా అన్నట్టుగా పరిస్థితి మారటంతో హౌస్ లో మొదటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న జరిగిన ఈ గొడవ బుధవారం ఎపిసోడ్ లో హైలెట్ గా మారింది. ఇదిలా ఉంటే గొడవ జరిగిన తర్వాత ఎప్పటిలాగానే సిరి మళ్ళీ అలిగింది. అంతకు ముందు రోజే సిరికి షణ్ముఖ్ మధ్య భారీ ఎత్తున డిస్కషన్ జరగటంతో… తాజాగా జరిగిన గొడవలు సిరి చాలా సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది.దీంతో వీరిద్దరి మధ్య జరిగిన గొడవ హౌస్ లో పెద్ద డిస్కషన్ గా మారింది. గత వారమే సిరి కెప్టెన్సీ టాస్క్ లో.. చివరి నిమిషంలో షణ్ముఖ్ చేతిలో ఓడిపోవడం జరిగింది.

Bigg Boss Telugu 5 preview: Siri to gain access to power room; Bigg Boss gives her a warning - Times of India

 

సిరి దగ్గరుండి షణ్ముఖ్ కి మంచి

ఒక విధంగా చెప్పాలంటే సిరి ఆ సమయంలో త్యాగం చేసి షణ్ముక్ నీ… గెలిపించి నట్లు సన్నివేశం కనబడింది. ఇటువంటి తరుణంలో సిరి పై కెప్టెన్సీ టాస్క్ లో.. షణ్ముక్ కోపం పడటం చూసే వారికి కొంత నెగిటివ్ గా ఉంది. షణ్ముఖ్ జస్వంత్ హౌస్ లో వచ్చిన నాటి నుండి.. ఎక్కువగా ఎవరినీ కలవక పోయినా సందర్భంలో.. సిరి దగ్గరుండి షణ్ముఖ్ కి మంచి బూస్ట్ అప్ ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని గత వీకెండ్ ఎపిసోడ్ లో… షణ్ముఖ చెప్పడం జరిగింది. ఇటువంటి తరుణంలో గతవారం త్యాగం చేసిన క్రమంలో పాటు చాలా సందర్భాలలో అండగా ఉన్నా గాని.. సిరి పై షణ్ముక్ ఫైవ్ రావటమన్నది కరెక్ట్ కాదని.. తాజా గొడవపై వీక్షకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క షణ్ముక్ చేసిన దాంట్లో తప్పేమీ లేదని సిరి పై మిగతా సభ్యులు.. నోరు పారేసుకోకుండా ముందుగానే.. షణ్ముఖ్ ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా బుధవారం జరిగిన ఎపిసోడ్ లో వీరిద్దరి మధ్య జరిగిన గొడవ.. సోషల్ మీడియాలో డిస్కషన్ కి దారితీసింది.


Share

Related posts

Big Boss 5: తెలుగు ప్రజల బోర్ లైఫ్ ని ఎంటర్టైన్మెంట్ తో నింపడానికి రెడీ అయిపోయిన బిగ్ బాస్

arun kanna

కింగ్ నాగార్జునకు ఏమాత్రం తీసిపోని ఓ సాధారణ సబ్ ఇన్స్పెక్టర్!గవర్నరే ముగ్దురాలైన వైనం!!

Yandamuri

ఐదు కేంద్రాల్లో కొనసాగుతున్న రీపోలింగ్

somaraju sharma