Refrigirator: ఫ్రిజ్ ని ఇలా క్లీన్ చేసుకోండి!! దుర్వాసన పోవడానికి  ఇది మంచి మార్గం !!

Share

Refrigirator: ఫ్రిజ్ అంటే ఇప్పుడు చాలామంది ఇళ్లలో ఒక చిన్న సైజు బీరువా అయిపోయింది. వంట ఇంటిలో సగం సామాన్లు  అందులోనే మనకు కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు వాటిని కాళీ చేసుకుని  ఫ్రిజ్ తుడువాలంటే చాలా మంది అదేదో పెద్ద పని అన్నట్లు వాయిదా వేస్తుంటారు. కనీసం పండుగలకు,శుభకార్యాలకు కూడా   అస్సలు క్లీన్ చేయరు.  క్లీన్ లేకుండా అలానే ఉంచేస్తే  పురుగులు పట్టి  మొత్తం పాడైపోతుంది.   చాలా తేలికగా ఎప్పటికప్పుడు   ఫ్రిజ్ ను శుభ్రం చేసుకునే  కొన్ని చిట్కాలు  తెలుసుకుందాం.

ఫ్రిజ్ శుభ్రం చేయాలంటే ముందు ఫ్రిజ్ పూర్తిగా ఆఫ్ చేసి, అందులోంచి వస్తువులు మొత్తం తీసి బయట పెట్టి  . పాడైపోయిన ఆహారాన్ని  బయట పడేయాలి.
వెనిగర్, నిమ్మరసం  కలిపిన నీటితో ఫ్రిజ్ లోపల, బయట  శుభ్రం గా తుడవాలి. ప్రతి అరను విడివిడిగా కడగాలి. కూరగాయలు ఉంచే ట్రే ను ఖాళీ చేసి ఎప్పటికప్పుడు శుభ్రంగా కడగాలి. అలా చేయకపోతే కూరగాయలు కుళ్లిపోతాయి .

ఫ్రిజ్ అంతా శుభ్రంగా కడిగి పొడి గుడ్డతో తుడిచాక   అందులో  పెట్టుకునే  డబ్బాలు  లు శుభ్రంగా  తుడిచి
ఆహారపదార్థాలను క్రమ పద్ధతిలో సర్దుకోవాలి.  ఫ్రిజ్ లో ఆహార పదార్థాలు  ఇరుకుగా ఉండేలా పెట్టవద్దు. ఫ్రిజ్ లో గాలి పోయేలా ఖాళీ  ఉండాలి.
సువాసన వచ్చే వస్తువులు, పూలు ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు వాటి నుంచి  వాసన బయటకు రాకుండా ఉండేందుకు కవర్ లో పెట్టి  సీల్ చేసుకుని పెట్టుకోవాలి  .
ఫ్రిజ్ లో పెట్టే  ఆకుకూరలు  వేరులను  కత్తిరించి కుళ్ళిన ఆకులు ఏమైనా ఉంటే తీసేసి కవర్ లో పెట్టి , కాయగూరలు తడిలేకుండా చేసుకుని  నిల్వ చేసుకోవాలి.పాలు, దోసెల పిండి, ఇడ్లీ పిండి,పూర్ణం, పెరుగు వంటివి    మూత పెట్టి నిల్వ చేసుకోవాలి  .

ఫ్రిజ్ లో ఎక్కువగా ఐస్ పేరుకుపోకుండా   చూసుకోవాలి. ఒకవేళ ఐస్  ఎక్కువగా ఉంటే  ఆఫ్ చేసి ఐస్ గడ్డలు తీయాలి .
చికెన్,ఫిష్ ముక్కలు ,  మటన్, వంటివి డీప్ ఫ్రీజర్ లో  పెట్టుకోవాలి. గుడ్లు ఎగ్ -ట్రే లో సర్దుకోవాలి.
ఫ్రిజ్ లో  చేపలు ఉంచితే దీనిపై తప్పక మూత  పెట్టాలి . లేకపోతే ఫ్రిజ్ అంతా చేపల వాసన వస్తుంది. ఎప్పుడైనా  ఫ్రిజ్ చెడు వాసన వస్తే నిమ్మకాయ కోసి ఆ ముక్కలు ఉంచండి.


Share

Related posts

AIIMS Chief DR Randeep Guleria: కరోనా నిర్ధారణకు సీటీ స్కాన్ చేయించుకుంటున్నారా..? అయితే ఇది మీరు తెలుసుకోవాల్సిందే..!!

somaraju sharma

Covid 19: థర్డ్ వేవ్ లో రెండు డోసుల కోవిడ్ వ్యాక్సినేషన్ సరిపోదు? మూడు డోసులతోనే రక్షణ..?

arun kanna

Bigg Boss 5 Telugu: హౌస్ నుండి వెళ్తూవెళ్తూ రవి కి వార్నింగ్ ఇచ్చిన లహరి..!!

sekhar