NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

పద్మారావు వ్యాఖ్యలతో తెలంగాణ పిక్చర్ క్లియర్!కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టడమే తరువాయి!

టీఆర్​ఎస్​లో ‘సీఎం కేటీఆర్​’ కోరస్​ రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్​ కూడా గొంతు కలిపారు.

గురువారం సికింద్రాబాద్​లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ డివిజన్ ఆఫీసు ఓపెనింగ్​లో  పాల్గొన్న ఆయన ‘‘పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్, బహుశా ​కాబోయే సీఎం.. కేటీఆర్​కు శుభాకాంక్షలు. ​ ముఖ్యమంత్రి అయ్యాక రైల్వే ఉద్యోగులకు ఇబ్బందులు రాకుండా కాపాడుతారని ఆకాంక్షిస్తున్న. శాసనసభ, రైల్వే కార్మికుల తరఫున కేటీఆర్​కు శుభాకాంక్షలు’’ అంటూ వ్యాఖ్యానించారు. పద్మారావుగౌడ్​ ఇలా మాట్లాడుతుండగా స్టేజీపైన మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారు. ఆ మాటలు విన్న కేటీఆర్​.. పద్మారావును చూస్తూ చిరునవ్వులు నవ్వారు. డిప్యూటీ స్పీకర్​ తాజా కామెంట్లతో జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరింది. అది కూడా కేటీఆర్​ ఆ పక్కరోజే మరో ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమక్షంలోనే  ఇలా అభినందించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్​గా మారింది.మంత్రి కేటీఆర్​ తన ప్రసంగంలో ఎక్కడ కూడా పద్మారావుగౌడ్​ మాటలను ఖండించకపోవడం, సమర్థించకపోవడం ఆసక్తిగా మారింది.

సీనియర్ మంత్రి ఈటెల తో మొదలు

కాగా రాష్ట్రంలో త్వరలో అధికార మార్పిడి జరగబోతోందన్న సంకేతాన్ని ముందుగా సీనియర్ మంత్రి ఈటెల రాజేందర్ ఇచ్చారు.ఒక టీవీ చానెల్ఇచ్చిన ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు బదులుగా కేటీఆర్ అన్ని విధాలా సీఎం పదవికి అర్హుడని ఇప్పటికే ఆయన దాదాపు ఆ బాధ్యతలను మోస్తున్నారని ఆయన బదులిచ్చారు.అందరూ కెటిఆర్ ముఖ్యమంత్రి కావడంలో తప్పేమీ లేదని అది ఎవరికీ అభ్యంతరకర౦ కూడా కాబోదని కూడా ఆయన చెప్పారు.ఆ పక్కరోజే మరో ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షకీల్’ బాజిరెడ్డి లు కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారన్న విధంగా మాట్లాడారు.తామంతా ఇందుకు మద్దతిస్తామని కూడా వారు చెప్పారు.తాజాగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఏకంగా కేటీఆర్ ని పక్కనే పెట్టుకొని కాబోయే ముఖ్యమంత్రి అని పేర్కొనడంతో ఈ వ్యవహారం చాలా ముందుకు వెళ్లిపోయిందని స్పష్టమవుతోంది.పద్మారావు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. ముఖ్యమంత్రి కుటుంబానికి కూడా ఆయన సన్నిహితులు.ఇప్పుడు ఆయన నోటి వెంటే కాబోయే ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్య రావడంతో కెసిఆర్ పట్టాభిషేకానికి రంగం పూర్తిగా సిద్ధమైపోయిందని,ముహూర్తమే తరువాయి అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు!

 

author avatar
Yandamuri

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju