NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా అకస్మాత్తుగా పరిశ్రమను మూసివేస్తే తాను ఎలా బతకాలి అంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమను తెరవాలని డిమాండ్ చేస్తూ .. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు, నేతలు ఆందోళనకు దిగారు.

నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాన గేటు ఎదుట నిరసన తెలిపారు. శుక్రవారం జిందాస్ స్టీల్ పరిశ్రమ లో పని చేస్తున్న 57 మంది ఉద్యోగులకు కంపెనీ సడన్ లే ఆఫ్ ప్రకటించింది. పరిశ్రమకు ప్రధాన ముడి సరుకు అందుబాటులో లేకపోవడం, ఉత్పత్తులకు మార్కెట్ లో సరైన ధర లేకపోవడంతో ఆర్ధికంగా నష్టపోతున్నట్లు యూనిట్ హెడ్ దినేశ్ శర్మ విడుదల చేసిన నోటీసులో పేర్కొన్నారు. దాన్ని కంపెనీ వద్ద బోర్డులో పెట్టారు.

దీంతో జిందాల్ పరిశ్రమను తెరవాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు, నేతలు ఆందోళనకు దిగారు. యాజమాన్యానికి సహకరించేందుకు తాము సిద్దమని తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా మూసివేయడాన్ని వారు తప్పుబట్టారు. ఈ చర్యలతో కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని, వారి కుటుంబాలు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వాపోతున్నారు. కాగా, పరిశ్రమ మూసివేతతో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సమస్యపై యాజమాన్య ప్రతినిధులతో కార్మిక సంఘాలు చర్చలు జరుపుతున్నాయి.

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N