NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో పేకాట క్లబ్ : రాధాకృష్ణ పరువు పాయె

 

రోజు మొదలైతే చాలు నీతి కథల తో… వారం అయితే కాదు తన చిలక పలుకులతో కానీ అత్యుత్తమ జర్నలిజం నుంచి వచ్చిన బొత్తిగా చెప్పుకునే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కార్యాలయాల్లో జరుగుతున్నది వింటే హవ్వ అని ఎవరైనా అనాల్సిందే.. ఆయనే కాదు జర్నలిజం మీద ఆసక్తి దానిపై ఎంతో మమకారం ఉన్న జర్నలిస్టులు అందరూ తలదించుకోవాల్సిన విషయం ఇది. ఆంధ్రజ్యోతి కార్యాలయం కడప జిల్లా బాధ్యతలు మొత్తం చూస్తున్న కడప యూనిట్ మేనేజర్ ఒకరు జూదగృహం నడిపిస్తూ పోలీసులకు చిక్కడం ఇప్పుడు మీడియా వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. జూద గృహం సైతం ఆంధ్ర జ్యోతి పేరు చెప్పి తీసుకున్న ఒక కార్యాలయం గానే అక్కడ తెలుస్తున్నా, దీనిపై పోలీసులు మాత్రం నోరు విప్పడం లేదు. అత్యంత పవిత్రమైన జర్నలిజం పేరు చెప్పి జూదగృహం నిర్వహిస్తున్న కడప జిల్లా ఆంధ్రజ్యోతి యూనిట్ మేనేజర్ ను అరెస్టు చేసినప్పటికీ, ఆయనపత్రిక తీరు, రాధాకృష్ణ చెప్పే నీతులపై మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.

కేసు ఏమిటంటే..

ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక క‌డ‌ప యూనిట్ బాధ్యతలని మేనేజ‌ర్ మ‌ద్దిప‌ట్ల ర‌ఘునాథ‌నాయుడు చూస్తున్నారు. ఈయన 15 ఏళ్లుగా ఇక్కడే పాతుకుపోయారు. ఆదివారం క‌డ‌ప న‌గ‌రం చిన్న‌చౌక్‌ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ప‌క్కీర్‌ప‌ల్లి తూర్పు వైపు స‌మాధుల ప‌క్క‌న కంప చెట్ల‌లో ఆరుగురు వ్య‌క్తులు పేకాట ఆడుతున్న స‌మాచారం అందింది. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు చిన్న‌చౌక్ సీఐ కె.అశోక్‌రెడ్డి నేతృత్వంలో ఎస్ఐ స‌త్య‌నారాయ‌ణ‌, పోలీసు సిబ్బంది క‌లిసి వెళ్లి దాడి చేశారు. పేకాట ఆడుతూ ఆరుగురు ప‌ట్టుబ‌డ్డారు. పోలీసుల‌కు చిక్కిన వాళ్ల‌లో ఆంధ్ర‌జ్యోతి క‌డ‌ప మేనేజ‌ర్ ర‌ఘునాథ‌నాయుడు కూడా ఉండ‌డం మీడియా స‌ర్కిల్స్‌లో క‌ల‌క‌లం రేపింది. నిందితుల నుంచి రూ.14 వేల న‌గ‌దు స్వాధీనం చేసుకున్నారు.

కొన్నాళ్ళుగా ఇదే తంతు

గ‌త కొంత కాలంగా ఆంధ్ర‌జ్యోతిని అడ్డుపెట్టుకుని గ్యాంబ్లింగ్‌ను ఆ ప‌త్రిక మేనేజ‌ర్ ర‌ఘునాథ‌నాయుడు ప్రోత్స‌హిస్తున్న‌ట్టు ఆరోప‌ణ‌లున్నాయి. చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లెకు చెందిన ఇత‌ను ఉద్యోగ నిర్వ‌హ‌ణ‌లో భాగంగా సుదీర్ఘ కాలంగా క‌డ‌ప‌లో తిష్ట‌వేసి , ఆంధ్ర‌జ్యోతిని అడ్డుపెట్టుకుని ఇటు రాజ‌కీయ నేత‌లు, అటు పోలీసు అధికారుల‌తో స‌త్సంబంధాలు నెరుపుతూ అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు క‌డ‌ప‌లో జ‌ర్న‌లిస్టులు కోడై కూస్తున్నారు. పోలీసులు పేకాట జరిగింది బయట ప్రదేశంలో అని చెబుతున్నా అది కడప ఆంధ్రజ్యోతి కార్యాలయంలోనే అని ప్రచారం జరిగింది. పై నుంచి వచ్చిన కొన్ని ఒత్తిళ్ళ మేరకే పేకాట బయటపడినట్లు పోలీసులు నమోదు చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూనిట్ మేనేజర్ బలి అయినా పర్వాలేదు కానీ పేకాట కార్యాలయంలోనే జరిగింది అంటే ఏకంగా పత్రిక పోవడంతో పాటు తీవ్రమైన విమర్శలు వస్తాయని కోణంలో పెద్ద స్థాయి నుంచి ఒత్తిళ్లు తీసుకువచ్చారని అందుకే దీన్ని బయట పాడినట్లుగా పోలీసులు చూపుతున్నారని సమాచారం.

ఎప్పుడేమంటావ్ రాధాకృష్ణ?

మేనేజర్ స్థాయి వ్యక్తి పై అజమాయిషీ పూర్తిగా పత్రిక యాజమాన్యందే. యూనిట్ మేనేజర్ ను పూర్తిగా యాజమాన్యానికి మాత్రమే బాధ్యత వహిస్తారు. వారు చెప్పిందే వీరు చేయడం, సిబ్బందితో దగ్గరుండి చేయించడం వీరి విధి. మరి యూనిట్ మేనేజర్ స్థాయి పేకాట ఆడుతూ పట్టుబడితే ఏమనాలి? పత్రిక యాజమాన్యానికి అడ్మిషన్ రాదు అనాలా? లేక యాజమాన్యానికి తెలిసే ఇదంతా జరుగుతుందా అనుకోవాలా అన్నది జర్నలిస్ట్ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఆంధ్రజ్యోతిలో వ్యవహారం అంతా ఇదే స్థాయిలో ఉంటుందని ఆ పత్రికలో పని చేసిన జర్నలిస్టులు చెబుతున్నారు. ప్రతి యూనిట్కు ప్రతి నెల ఇంత ని టార్గెట్ గా యాజమాన్యం ఇస్తుంది. అంటే ప్రతి యూనిట్ మేనేజర్ ఏం చేసినా సరే తన టార్గెట్ రీచ్ కావాలి. టార్గెట్ అంటే డబ్బు. యాడ్ మీద వచ్చే డబ్బు. దానికోసం ఆంధ్రజ్యోతిలో జరిగేవి చిత్రాలు అన్నీ ఇన్నీ కావు. ఒక మేనేజర్ తన టార్గెట్ ను చేరుకునేందుకు విభాగాలుగా దాన్ని విడదీసి ఇటు యాడ్లు తీసుకొచ్చే వారితోపాటు రిపోర్టర్లు సైతం టార్గెట్లు ఇస్తారు. ఆ యాడ్ తీసుకొచ్చే సమయంలో వచ్చే కమిషన్ భారీగా ఉంటుందని ఆశ తో రిపోర్టర్ సైతం అందరితో మంచిగా ఉంటూ ఏదైనా ప్రెస్ మీట్ కు లేదా సమావేశానికి వెళ్ళినప్పుడు చివర్లో యాడ్ చేయమని అడుగుతారు. దీనివల్ల కమిషన్ ముడుతుంది. గతంలో కవర్లు ఇచ్చే సంస్కృతి కి బదులు ఆంధ్రజ్యోతిలో యాడ్లు అడుగు… అధికారికంగా డబ్బులు దండుకో అన్న చందంగా పరిస్థితి ఉంటుంది. ఆంధ్రజ్యోతి లో వివిధ విభాగాల్లో వివిధ కేటగిరీల్లో వారి స్థాయిని బట్టి ఈ టార్గెట్లు ఈ యాడ్ల దందా బహిరంగంగానే కనిపిస్తుంది. నెలవారి టార్గెట్లు మూలంగా ఆంధ్రజ్యోతిలో బదిలీలు అంతంత మాత్రమే. ఒకే దగ్గర కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నవారు ఉన్నారు. దీంతోనే యాజమాన్యానికి అసలు కింద స్థాయిలో ఏం జరుగుతుందో పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అందరికీ నీతులు చెప్పడం మాని… తన సంస్థలో జరుగుతున్న ఈ విషయాలపై దృష్టి పెడితే బాగుంటుందని జర్నలిస్టులు సూచిస్తున్నారు.

author avatar
Special Bureau

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju