కడప ఉక్కుకు చంద్రబాబు శంఖుస్థాపన

 

కడప డిసెంబర్27: కడప ఉక్కు పరిశ్రమ విభజన చట్టంలో ఉన్నప్పటికి కేంద్రం ఏర్పాటుకు సహాకరించటం లేదని సీఎం విమర్శించారు. కేంద్రం నిర్మించదు, మనం నిర్మించుకుంటామంటే సహాకరించదు అని ఆయన అన్నారు. కేంద్రం మాపై పెత్తనం చేయడానికి మేమేమి బానిసలమా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం నిర్మించకున్నాతామే శంఖుస్ధాపన చేస్తున్నామని, తామే పూర్తి చేస్తామని చంద్రబాబు అన్నారు.  మైలవరం మండలం కంబాలదిన్నెలో కడప ఉక్కుకు సీఎం చంద్రబాబు గురువారం శంఖుస్ధాపన చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆదినారాయణరెడ్డి,ఎంపీ సీఎం రమేష్ పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.