YS Jagan: క్యాంపు కార్యాలయంలో విద్యా కానుక కిట్లు.. పరిశీలించిన జగన్..!!

Share

YS Jagan: వచ్చే ఏడాది పంపిణీ చేయనున్న విద్యా కానుక కిట్ లో ఉండే స్కూల్ బ్యాగ్ మరియు బుట్ల నాణ్యత.. సీఎం జగన్ సోమవారం పరిశీలించారు. విద్యాశాఖ అధికారులతో కలిసి.. విద్యార్థులకు అందించే స్కూల్ బ్యాగ్స్ మరియు షూస్ వాటి నాణ్యతను దగ్గరుండి గమనించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి జగనన్న విద్యా కానుక.. అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. ఈ క్రమంలో ఒకటి నుండి పదవ తరగతి విద్యార్థులకు మూడు జతల యూనిఫాం క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, స్కూలు బ్యాగు, పాఠ్యపుస్తకాలు, నిఘంటువు (డిక్షనరీ) ఇస్తున్నారు. అంత మాత్రమే కాక వచ్చే ఏడాది స్పోర్ట్స్ కి సంబంధించిన షూ కూడా ఇవ్వనున్నారు.

CM YS Jagan Inspected The Quality Of School Bags And Shoes - Sakshi

ఈ నేపథ్యంలో “జగనన్న విద్యా కానుక” లో భాగంగా ఉండే బ్యాగులు మరియు బుట్ల నాణ్యతను.. సీఎం జగన్ ఈరోజు క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. విద్యార్థులకు అందించే నోట్ పుస్తకాలు. పాఠ్య పుస్తకాలు.. అన్నిటినీ పరిశీలించడం జరిగింది. ఏపీలో జగనన్న విద్యా కానుక విద్యార్థులకు అందిస్తున్న తీరు ఈ రీతిగా ఉంది..1 నుంచి 10 వ తరగతి బాలురకు, 1 నుంచి 5వ తరగతి బాలికలకు బెల్టు ఇస్తున్నారు. 6 నుంచి 10వ తరగతి వారికి నోటుపుస్తకాలు అందజేస్తున్నారు.

 

ఒక్కో విద్యార్థికి ఆరు, ఏడు తరగతులకు 8, ఎనిమిదో తరగతికి 10, తొమ్మిదో తరగతికి 12, పదో తరగతికి 14 నోటుపుస్తకాలు ఇస్తున్నారు. మొత్తం మీద వచ్చే ఏడాదికి సంబంధించి విద్యార్థులకు అందించాల్సిన జగనన్న విద్యా కానుక వస్తువుల విషయంలో ఎప్పటి నుండి ముఖ్యమంత్రి జగన్ శ్రద్ధ చూపించడం పట్ల ఏపీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఓటు హక్కు కూడా లేని పిల్లల పట్ల ముఖ్యమంత్రిగా ఈ రీతిలో శ్రద్ధ తీసుకోవటం నిజంగా ఆశ్చర్యం అని.. ప్రజల పట్ల జగన్ చూపిస్తున్న శ్రద్ధ ఇందుకు నిదర్శనమని కొనియాడుతున్నారు.


Share

Related posts

టీడీపీ నేతలకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్న బీజేపీ..!!

sekhar

వీటిని తినడం వలన బాదం తో సమానమైన ఫలితాన్ని తక్కువ ఖర్చుతో పొందవచ్చు…

Kumar

Jyothakka : జ్యోతక్క రంగనాయక సాగర్ ట్రిప్ అదిరిపోయింది

Varun G