ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM Jagan: వీర సైనికుడు సాయి తేజ కుటుంబానికి అండగా నిలిచిన జగన్ సర్కార్..! సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!

Share

CM Jagan: తమిళనాడులో భారత త్రివిధ దళాధిపతి జనరల్ (సీడీఎస్) బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాఫ్టర్ కూలిన ప్రమాదంలో ఆయన తో సహా 13 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ పమాదంలో ఏపి రాష్ట్రం చిత్తూరు జిల్లాకు చెందిన సైనికుడు సాయితేజ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో జగన్మోహన రెడ్డి సర్కార్ సాయి తేజ కుటుంబానికి అండగా నిలిచింది. సాయితేజ కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది ఏపి ప్రభుత్వం. సాయి తేజ కుటుంబాన్ని ఆదుకునే విషయంలో అధికారులతో వివరాలు తెలుసుకున్న సందర్భంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

CM Jagan govt sanction ex gratia to soldiers Sai Teja family
CM Jagan govt sanction ex gratia to soldiers Sai Teja family

CM Jagan: రూ.50లక్షల ఎక్స్ గ్రేషియా

ఆ వీర సైనికుడి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఆదేశించిన సీఎం వైఎస్ జగన్ .. సైనికుడి మరణానికి వెలకట్టామన్న భావన రాకూడదని అధికారులకు స్పష్టం చేశారు. కష్టంలో ఉన్న కుటుంబాన్ని ఆదుకునే సమయంలో సహాయం చేస్తున్నామంటూ హడావుడి చేయవద్దని, మీడియా ప్రచారానికి దూరంగా ఉండాలని సూచించారు. సీనియర్ మంత్రి ఒకరు నేరుగా వీర సైనికుడి ఇంటికి వెళ్లి సానుభూతి తెలియజేసి ఎక్స్ గ్రేషియా అందించాలని ఆదేశించారు. సైనికుల మరణాలకు వెలకట్టలేమన్న సీఎం జగన్.. ఎక్స్ గ్రేషియాకు సంబంధించి మీడియాలో ఎలాంటి ప్రచారం చేయవద్దని సూచించినట్లు తెలుస్తోంది.

 

ఈ నెల 8 న తమిళనాడులోని సూలురు ఎయిర్ బేస్ నుండి సీ డీ ఎస్ బిపిన్ రావత్ హెలికాఫ్టర్ లో వెల్లింగ్డన్ కు బయలుదేరగా మరో అయిదు నిమిషాల్లో గమ్యానికి చేరుకునేలోపే ప్రమాదానికి గురైంది. హెలికాఫ్టర్ కుప్పకూలిన ఘటనలో బిపిన్ రావత్ తో సహా 13 మంది మృతి చెందగా కెప్టెన్ వరుణ్ సింగ్ తీవ్రగాయాలతో బయటపడ్డారు. ఆయనకు మిలటరీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.


Share

Related posts

Cold Cough: ఈ సీజన్ లో జలుబు, దగ్గు రాకుండా ఉండాలంటే ఇవి తినాలి..!!

bharani jella

Sri Reddy: మెగాస్టార్ తల్లికి శ్రీరెడ్డి క్షమాపణ!వెనక ఏదో ఉండే ఉంటుందని టాలీవుడ్ అనుమానం!!

Yandamuri

Yatra 2 : యాత్ర 2 అవన్నీ పుకార్లేనా..?

GRK