రాజధానిపై మాట్లాడేందుకేనా!?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

అమరావతి: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో జగన్ సమావేశమయ్యారు. మూడు రాజధానులు రావచ్చంటూ అసెంబ్లీలో జగన్ వ్యాఖ్యలు చేసిన తర్వాత గవర్నర్‌ను కలవడం ఇదే తొలిసారి. ఇటీవల అమరావతి ప్రాంత రైతులు రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ గవర్నర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చిన విషయం తెలిసిందే, ఈ నేపథ్యంలో గవర్నర్‌తో జగన్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. వీరి మధ్య రాజధాని అంశం ప్రత్యేకంగా చర్చకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఏపి సమగ్రాభివృద్ధికి జిఎన్ రావు కమిటీ నివేదిక, ఇటీవల నియమించిన హైపవర్ కమిటీ తదితర అంశాలను గవర్నర్‌కు సిఎం వివరించనున్నారు. దీనితో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపైనా గవర్నర్‌తో జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.