NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

నారా హెరిటేజ్ X జగన్ అమూల్..! క్షీర కార్యమా..? కక్ష కార్యమా..!? (పార్ట్ 1)

సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా అది బహుళ ప్రయోజనకారిగా ఉంటుంది..! అంటే ఆయనకు మాంచి పాలకుడిగా ప్రతిష్ట పెంచుతూనే.. ప్రత్యర్థికి ముప్పుతిప్పలు పెట్టేలా ఉంటుంది..! మూడు రాజధానుల సూత్రం, సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమం అనేవి ఆ కోవలోకే వస్తాయి..!! ఇప్పుడు తాజాగా జగన్ తీసుకున్న మరో నిర్ణయం కూడా అటువంటిదే. “రాష్ట్రంలోని సహకార డెయిరీలను అమూల్ కి అప్పగించడం” అనేది సాధారణ నిర్ణయం కాదు. అమూల్ అంటే అల్లాటప్పా కంపెనీ కాదు. దీనిలో జగన్ మార్కు కచ్చితంగా ఉంది. అదేమిటో లోతుగా వెళ్లి తెలుసుకుందాం..!!

అమూల్ గురించి క్లుప్తంగా..!!

ఇప్పుడు కాదు కానీ..! 1970 , 1980 , 1990 దశకాల్లో ఇండియాలో అనేక మంది చిన్న పిల్లలకు అమూల్ పాలపొడి డబ్బాల్లో పాలను పట్టేవారు. బఱ్ఱె పాలను పొడిగా మార్చి, డబ్బాల్లో అమ్మడం అనేది అమూల్ తీసుకొచ్చిన సంస్కృతి..!!

read also>>(పార్ట్-2) నారా హెరిటేజ్ X జగన్ అమూల్..! అమూల్ కి అంత ఈజీ కాదు..!!


అమూల్ కంపెనీ అంటే స్వాతంత్రానికి ముందునాటి చారిత్రిక కథ. సింపుల్ గా చెప్పుకోవాలి అంటే 1904 నాటి కథ. అప్పట్లో దలాల్ (బ్రిటిష్ ప్రతినిధి)అనే వ్యాపారి పాల రైతులకు సరిగా ధరలు ఇవ్వక, హింసించేవాడు. దీంతో ఆ రైతులు అందరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ వద్దకి వెళ్లి పిర్యాదు చేస్తే.. మీరందరూ పరస్పర సహకారంతో, ఐక్యంగా ఉండండి అని సూచనలిచ్చారు. కానీ చాలా కాలం రూపు దాల్చలేదు. చివరికి 1946 త్రిభువన్ దాస్ పటేల్ ఆధ్వర్యంలో “కైరా డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్” ఏర్పాటయింది. దీనిలోకి 1949 లో వర్గీస్ కురియన్ ప్రవేశించారు. ఈయన మిచిగాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివి అప్పుడే వచ్చారు. అలా.. అలా తన వినూత్న ఆలోచనలతో క్షీర విప్లవానికి నాంది పలికారు. రైతులను నమ్మకం కలిగించి, పాల పొడి, ఇతర ఉత్పత్తులను దించడం మొదలు పెట్టారు. ఆ వర్గీస్ కురియన్ తర్వాత “క్షీర విప్లవ పితామహుడు” అయ్యారు. ఆ కైరా జిల్లా పాల సహకారం సంఘం “అమూల్” అయింది. ఆ అమూల్ ఇప్పుడు మన రాష్ట్రంలోకి అడుగు పెడుతుంది. భారీగా, బీభత్సమైన ప్రణాళికతో వస్తుంది..!!

read also>>(పార్ట్-2) నారా హెరిటేజ్ X జగన్ అమూల్..! అమూల్ కి అంత ఈజీ కాదు..!!

ఏపీలో బాబు బిజినెస్ కి ఎసరు ..!?

“రాష్ట్రంలో సహకార డెయిరీలను చంద్రబాబు నాశనం చేస్తున్నారు. తన హెరిటేజ్ కి ధారాదత్తం చేస్తున్నారు. అందుకే మేము అధికారంలోకి వస్తే రైతులకు లీటర్ కి రూ. నాలుగు అదనంగా ఇచ్చి, పాల సేకరణ చేసి, ప్రభుత్వ డెయిరీలను నిలబెడతాం” అంటూ జగన్ ఎన్నికల ప్రచార హామీ గుర్తుండే ఉంటుంది కదా..!! ఆ హామీ నెరవేర్చే క్రమంలో ఇప్పుడు ప్రభుత్వ డెయిరీలను అమూల్ కి అప్పగింత జరుగుతుంది. అంటే పాల వ్యాపారంలో కార్పొరేట్ దిగ్గజంగా ఉన్న అమూల్ ని రంగంలోకి దించి.., ఏపీలో కార్పొరేట్ కంపెనీగా ఉన్న హెరిటేజ్ పాల మూలాలను దెబ్బకొడితే… తన హామీ నెరవేరినట్టు.., బాబు వ్యాపారం బెడిసికొట్టినట్టు. రెండు కార్యాలు జరిగిపోతాయి. అయితే ఇక్కడ కూడా జగన్ కి చిక్కొచ్చి పడింది. ఈ నిర్ణయంతో ఆయనపై విమర్శలూ లేకపోలేదు.

read also>>(పార్ట్-2) నారా హెరిటేజ్ X జగన్ అమూల్..! అమూల్ కి అంత ఈజీ కాదు..!!

ప్రభుత్వమే చేయొచ్చుగా..!?

అమూల్ అంటే కార్పొరేట్ కంపెనీ. ప్రభుత్వ డెయిరీలను తీసుకుంటే బాగుపడేది అమూల్ తప్ప, డెయిరీలు కాదు. మహా అయితే రైతులకు ప్రయోజనం దక్కుతుంది.., కానీ రైతు సంఘాలు మాత్రం కార్పొరేట్ గుప్పిట్లోకి వెళ్లిపోతాయి. ప్రభుత్వమే రాష్ట్రంలోని సహకార పాల డెయిరీలను ఆధీనంలోకి తీసుకుని, పాలక మండళ్లు ఏర్పాటు చేసి, ప్రత్యేక అధికారులను నియమించి బాగు చేసే అవకాశం ఉంది. అదీ జగన్ ఆలోచన చేయొచ్చు..! కాకపోతే అసలే నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ డెయిరీలకు పాలక మండళ్లు అంటే రాజకీయం తోడవుతుంది. తద్వారా ఎంతోకొంత అవినీతి తోడవుతుంది. అందుకే ఆ డెయిరీలు బాగవుతాయో, లేదో అనే నమ్మకం లేదు. అందుకే ఇవన్నీ ఎందుకు.., అమూల్ కి ఇచ్చేస్తే నడిపించుకుంటారు కదా..! అంటూ జగన్ ఆలోచించవచ్చు..! కానీ అమూల్ కంటే “జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డు” ఉంది. వారికి ఇచ్చినా డెయిరీలు బాగయ్యే అవకాశం ఉంటుంది. అదీ కాదని సీఎం జగన్ అమూల్ కి ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారనేది వారికే తెలియాలి..!!

కానీ… దీనికి సంబంధించిన మరిన్ని అంశాలను మనం చెప్పుకోవాలి..!? ఏపీలో అమూల్ కి ఎదురవనున్న సవాళ్లు ఏంటి..? పాల విషయంలో ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లు ఏంటి..? అనేది తర్వాత కథనాల్లో చెప్పుకుందాం…!!

author avatar
Srinivas Manem

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!