NewsOrbit
న్యూస్

ఎస్పీల మీటింగ్ లో సిఎం జగన్ చెప్పింది వింటే వహ్వా అనాల్సిందే..!!

cm jagan serious on dalith attacks

ఇటివల ఆంధ్రప్రదేశ్ లో దళిత వ్యక్తిపై దాడి ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పీఎస్ లో జరిగిన శిరోముండనం ఘటన సంచలనం రేపింది. బాధిత యువకుడు ఏకంగా రాష్ట్రపతికి అర్జీ పెట్టుకోవడం వరకూ వెళ్లింది. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఈ ఘటనపై భగ్గుమన్నాయి. ఈ ఘటనపై హోంమంత్రి, డీజీపీ స్పందించి ఘటనకు కారకులపై చర్యలు తీసుకున్నారు. అయితే.. ఈ ఘటనపై ఇప్పటివరకూ సీఎం జగన్ స్పందించలేదు. నిన్న సీఎం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంలో భాగంగా జరిపిన వీడియో కాన్ఫరెన్సులో ఈ అంశంపై స్పందించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

cm jagan serious on dalith attacks
cm jagan serious on dalith attacks

దళితులపై దాడులు సహించేది లేదు..

రాష్ట్రంలో జరిగిన దళితులపై దాడులు, యువకుడికి శిరోముండనం ఘటనలు జరగడం దురదృష్టకరం. ఈ ఘటనలో ఎస్సై స్థాయి వ్యక్తిని జైలుకి పంపించాం. నిష్పక్షపాత విచారణ జరిపించాం. ఇటువంటి ఘటనలు జరుగకుండా ఎస్పీలు, ఏఎస్పీ, డీఎస్పీలు దీనిపై సమావేశాలు నిర్వహించాలి. మానవత్వంపై విడమరచి చెప్పాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఈ వ్యవస్థలో మార్పులు రావాలి. ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. గుండు కొట్టించిన ఘటనలో మన బంధువులే ఎలా ఉంటే ఎలా బాధపడతామో ఆలోచించాలి. క్షేత్రస్థాయిలో పోలీసులకు ఈ విషయం వెళ్లేలా చేయాల్సిన బాధ్యత మీదే.

ఎక్కడ తప్పు జరిగినా ఉపేక్షించేది లేదు.

తప్పు చేస్తే ఏస్థాయి వ్యక్తులకైనా శిక్ష పడేలా మన ప్రభుత్వం ఉండాలి. సీఐ, ఎస్సై స్థాయి వ్యక్తులైనా కానిస్టేబుల్స్ అయినా ఈ ప్రభుత్వంలో తప్పు చేస్తే ఉపేక్షించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి ఘటనలు జరిగినే పట్టించుకున్న వారు లేరు. ఈ ప్రభుత్వంలో చేసి చూపించాలి. ఈ విషయంలో నా దగ్గర నుంచి హోం మినిస్టర్, డీజీపీ, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ వరకూ కఠిన నిర్ణయాలు తీసుకునే విధంగా ముందుకెళ్లాలి. రాజకీయ నాయకులకు ఇందులో ప్రమేయం లేకుండా చూడాలి. ఈ ప్రభుత్వంలో హోంమంత్రి దళిత మహిళ. డీజీపీ ఎస్టీకి చెందిన వ్యక్తి. ప్రభుత్వమే ప్రజలను కాపాడలేకపోతే మనం చేపట్టే మంచి పనులకు అర్ధం ఉండదు. ఈ అంశాలన్నింటినీ క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి అని సీఎం జగన్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

author avatar
Muraliak

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!