NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Tirupati : తిరుపతిలో తిరుగులేని మెజార్జీని టార్గెట్ గా పెట్టిన సీఎం జగన్!మంత్రుల ద౦డు కూడా రెడీ!

Tirupati : ఏపీ లో వరుస ఎన్నికలు రాజకీయ హీటు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే పంచాయితీ, మున్సిపల్‌ ఎన్నికల్లో విజయాలతో జోరు మీదున్న వైసీపీ.. ఇప్పుడు తిరుపతి లోక్ సభ స్థానంపై ఫోకస్ పెట్టింది. ఉప ఎన్నికలో విజయం తమదేనని ఫిక్స్ అయిపోయింది. అంతేకాదు ఇప్పుడు నాయకుల దృష్టంతా మెజార్టీ పైనే ఉందట. సాదా సీదా గెలుపు కాదు.. కనీసం 4 లక్షల మెజార్టీ సాధించాలని సీఎం జగన్ టార్గెట్ ఫిక్స్ చేశారట. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఫలితాలు ఉండాలని నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

CM Jagan targets irreversible Majority in Tirupati!
CM Jagan targets irreversible Majority in Tirupati!

Tirupati : వంద శాతం నమ్మకంతో వైసీపీ!

తిరుపతి ఉపఎన్నికలో గెలుపుపై వైసీపీలో ధీమా కనిపిస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటామని ఆ పార్టీ నేతలు బల్ల గుద్ది చెబుతున్నారు. ఇప్పటికే తమ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని వైసీపీ ప్రకటించింది. రాజకీయాలకు కొత్త.. ఉన్నత విద్యావంతుడు కావడంతో అతని అభ్యర్థిత్వంపై పాజిటివ్ టాక్ ఉందని అధికార పార్టీ భావిస్తోంది. లాభనష్టాలతో బేరీజు లేకుండా సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడన్నా సానుకూల అంశం కూడా గురుమూర్తికి భారీ మెజార్టీ తీసుకొస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఏడుగురు మంత్రులు

తిరుపతి పార్లమెంట్ పరిధిలో చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు కలిపి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాలకు కీలక మంత్రులను నియమించడం ద్వారా గెలుపును ముందే డిక్లేర్ చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. తిరుపతికి పేర్ని నాని, శ్రీకాళహస్తికి గౌతమ్ రెడ్డి, సత్యవేడు కొడాలి నాని, సూళ్లూరు పేటకు కన్నబాబు, వెంకటగిరికి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, సర్వేపల్లికి ఆదిమూలపు సురేష్, గూడూరుకు అనిల్ కుమార్ యాదవ్ లను ఇన్ ఛార్జ్ లుగా నియమించారు. ఓవరాల్ బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి లకు కట్టబెట్టారు. కనీసం 4 లక్షల మెజారిటీ తగ్గకుండా సాధించాలని సీఎం జగన్ మంత్రులకు టార్గెట్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Tirupati : నాలుగు లక్షల మెజార్టీ టార్గెట్!

తిరుపతి పార్లమెంటు బరిలో సుమారు 16.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2019 ఎన్నికల్లో 13.20 లక్షల మంది ఓటేశారు. ఇందులో వైసీపీకి 7.22 లక్షల ఓట్లు రాగా, టీడీపీకి 4.94 లక్షల ఓట్లు వచ్చాయి. 80 శాతం పోలింగ్ జరగగా.. 2.28 లక్షల ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచింది. మరి ఈ దఫా సీఎం జగన్ కోరుతున్నట్లు 4 లక్షల మెజారిటీ సాధించాలంటే.. పోలింగ్ శాతం పెంచడంతో పాటు మరిన్ని అదనపు ఓట్లు సాధించడమే వైసీపీ ముందున్న లక్ష్యం. అయితే మున్సిపల్ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు తమకు కలిసివస్తాయని వైసీపీ భావిస్తోంది. ఇక మంత్రుల ఎంట్రీతో తిరుపతి బై పోల్ మరింత రసవత్తరంగా సాగనున్నట్లు తెలుస్తోంది.

 

author avatar
Yandamuri

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?