NewsOrbit
న్యూస్

CM Jagan VS Nimmagadda ; ఈ సారికి కాంప్రమైజ్..! కానీ పరిషత్ ల గొడవ తీర్చేదెవరు..!?

YS Jagan : YSRCP playing Dangerous Political Game

CM Jagan VS Nimmagadda ; ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. మార్చి 10 న పోలింగ్ జరగనుంది. మార్చి 14 న కౌంటింగ్ జరగనుంది..! గత ఏడాది ఎక్కడ ఆగిందో అక్కడి నుండి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యేలా ఎన్నికల కమీషనర్ ఉత్తర్వులిచ్చారు. సో.. ఇక ఏపీ ప్రభుత్వానికి – కమీషనర్ కి ప్రస్తుతానికి నో గొడవ. కానీ ఇక్కడితో ముగియలేదు. కీలకమైన మండల/ జిల్లా పరిషత్ ఎన్నికలు ముందున్నాయి. అవి కూడా ఎక్కడ ఆగాయో అక్కడి నుండి కొనసాగిస్తారా..? లేదా ఫ్రెష్ గా నోటిఫికేషన్ ఇస్తారా అనేది అత్యంత కీలకం కానుంది.

cm-jagan-vs-nimmagadda-compramise
cm-jagan-vs-nimmagadda-compramise

CM Jagan VS Nimmagadda ; ఈ సారికి కాంప్రమైజ్… కానీ అప్పుడు మాత్రం..!?

మున్సిపల్ ఎన్నికల్లో గత ఏడాది పెద్దగా ఏకగ్రీవాలు జరగలేదు. గొడవలు కూడా ఎక్కడా ఎక్కువగా జరగలేదు. నామినేషన్లు విషయంలో రచ్చలు, రగడలు, కిడ్నప్ ఆరోపణలు.. ఇతర వ్యవహారాలు ఏమి లేవు. అందుకే ఈ నోటిఫికేషన్ మాత్రం గత ఏడాదికి కొనసాగింపు నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రభుత్వంతో కాంప్రమైజ్ అయిపోయారు. ఇది ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వడంలో పెద్దగా ప్రభుత్వం కూడా పట్టించుకోదు. ప్రభుత్వానికి వచ్చే నష్టమేమి ఉండదు. కానీ ఇరువర్గాలు మాట్లాడుకుని.. త్వరగా పూర్తి చేసే ఉద్దేశంతో కొనసాగింపు నోటిఫికేషన్ ఇచ్చేసారు అనుకోవచ్చు. నిమ్మగడ్డకి పెద్దగా సమయం లేదు. అందుకే దీనికి వివాదాలకు పోలేదు. కానీ పరిషత్ ఎన్నికలకు మాత్రం ప్రతిష్టంభన కొనసాగనుంది..!!

cm-jagan-vs-nimmagadda-compramise
cm jagan vs nimmagadda compramise

ప్రభుత్వానికి అత్యంత కీలకం ఇవే..!!

ప్రభుత్వానికి మండల / జిల్లా పరిషత్ ఎన్నికలే కీలకం. ఆ నోటిఫికేషన్ మాత్రమే కీలకం. గత ఏడాది సుమారుగా 25 శాతం స్థానాలు అధికార పార్టీకి ఏకగ్రీవాలు అయ్యాయి. ఒకవేళ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తే అవన్నీ వైసిపి ఖత నుండి పోయినట్టే. అసలే నిమ్మగడ్డ ఈసారి ఏకగ్రీవాలు విషయంలో కఠినంగా ఉంటున్నారు. అప్పుడు జరిగిన ఏకగ్రీవాలు అన్నీ కిడ్నాప్, గొడవలు, ఘర్షణలు, బెదిరింపులతోనే బలవంతంగా జరిగాయని నిమ్మగడ్డ కోర్టులో అఫడవిట్ కూడా వేశారు. అంటే ఆయన ఒప్పుకున్నట్టే. ఎన్నికల కమీషనర్ స్థానంలో ఉంటూ… తనే స్వయంగా అక్రమాలు జరిగాయని ఒప్పుకున్న ఎన్నికలను ఎలా కొనసాగిస్తారు. సో.. వాటిని రద్దు చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలే ఉన్నాయి. అదే జరిగితే…

కోర్టుకి ప్రభుత్వం/ నాటి విజేతలు..!?

ఒకవేళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫ్రెష్ గా నోటిఫికేషన్ ఇస్తే మాత్రం కచ్చితంగా ప్రభుత్వం కోర్టుకి వెళ్తుంది. నాడు ఏకగ్రీవంగా గెలిచిన విజేతలు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో.., ఇది తలనొప్పి తప్పదు. జాప్యం తప్పదు. అందుకే ముందుగా పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు పెట్టేసి.. తనకు తలనొప్పిగా మారే పరిషత్ ఎన్నికలను చివరి దశలో నిర్వహించాలి అని నిమ్మగడ్డ భావించి ఉండవచ్చు. అయితే కోర్టులో ఒక వారం/ రెండు వారాలు జాప్యం జరిగినా తనకు ఇబ్బంది లేకుండా మార్చి 31 లోగా తన మాటని నెగ్గించుకుని.. తాను అనుకున్నట్టు ఫ్రెష్ నోటిఫికేషన్ ద్వారా ఆ ఎన్నికలు నిర్వహించాలి అనేది నిమ్మగడ్డ ఆలోచన. సో.. ఈ వివాదం ఎలా ఆరంభమవుతుందో చెప్పవచ్చు.. ఎలా..? ఎవరికీ అనుకూలంగా ముగుస్తుంది అనేది మాత్రం అనుమానమే..!!

author avatar
Srinivas Manem

Related posts

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?