కేసిఆర్ దత్తపుత్రికకు వివాహం..! విశేషమే మరి..!!

 

(హైదరాబాదు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

కొన్ని నెలలుగా పత్రికల్లో బాగా వినిపించిన పేరు ప్రత్యూష. ఈమె ఎవరో కాదు. ఈమె ఎవరో కాదు కేసీఆర్ దత్త పుత్రిక. కన్న తల్లిదండ్రుల వేధింపులతో బాధపడి గాయాలతో హాస్పిటల్ చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితిని చూసి చలించిపోయిన కేసీఆర్ ఆమెను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆమెను చదివించడానికీ, పెంచి పెళ్ళి చేసే బాధ్యత కూడా తనదేనని నాడు కేసిఆర్ ప్రకటించారు.

 

ప్రత్యూష బాధ్యతను ఐఏఎస్ అధికారి రఘునందన రావుకి అప్పగించారు. ఆమెను మహిళా శిశు సంక్షేమ శాఖ హాస్టల్‌లో ఉంచి ఆరోగ్య పరిరక్షణ చర్యలు చూడటంతో పాటు చదివించడంతో ఆమె చదువులో బాగా రాణించారు. తాను ఇష్టపడిన మమత రెడ్డి దంపతుల కుమారుడు చరణ్ రెడ్డితో ప్రత్యూష వివాహాం నిశ్చయమైంది. ఈ వేడుకలను మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య నిర్వహించాలని కేసిఆర్ ఆదేశించారు. అందుకు ఆమె దగ్గర ఉండి నిశ్చితార్థ వేడుక నిరాడంబరంగా చేయించారు. ఈ వివాహ వేడుకకు సీఎం కేసీఆర్ ఖచ్చితంగా హజరవుతానని ప్రత్యూషతో హామీ ఇచ్చారని ఆమె తెలిపింది. ఈ రోజు ఇంత సంతోషంగా ఉండటానికి కారణం మాత్రం కెసిఆర్ చలువేనని ఆమె పేర్కొన్నది. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను బాధను అనుభవించిన తాను ఈ రోజు నర్సింగ్ చదువుకొని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో ఉద్యోగిగా ఉంటూ తనకు ఇష్టమైన వ్యక్తితో వివాహం జరిపించిన కెసిఆర్ మంచితనమే అంటున్నది ప్రత్యూష.