హైదరాబాద్ లో జరిగింది అవినీతా..? నిర్లక్ష్యమా..!? కేసీఆర్ కి పెద్ద షాక్..!

* దినాలు మారినయ్ దొరా..! కేసీఆర్ ఊహించని ఎదురీత..!!
* గ్రేటర్ లో రోడ్డెక్కుతున్న వరద బాధితులు..!

దుబ్బాకలో ఎలచ్చన్లు టైట్ గా మారినయ్..! విపక్షాలు స్ట్రాంగ్ అయినయ్..! బీజేపీతో కలిసిన చిన్న పార్టీలు ఈ ఎన్నికని ఫైట్ చేసినయ్..!
కరీంనగర్ లో మంత్రి, హీరోయిన్ రాసలీలలు, చాటింగు వార్తలు గుప్పుమంటున్నయ్.., దీనిలో ప్రభుత్వ పెద్దలకు మచ్చలు అంటుతున్నయ్..!
నడిమిట్ల హైదరాబాద్ లో చూస్తే బస్తీల లొల్లిలు జరుగుతున్నయ్..! వరద పరిహారం పైసల్ అందలేదు అంటూ రోడ్డెక్కిన్రు..! ఇవేమీ కేసీఆర్ ఊహించలేదు. సాఫీగా సాగిపోతున్న తన పాలనలో ఇప్పటికిప్పుడు ముంచుకొస్తున్న ఈ ట్విస్టులు, తిప్పలతో బయటపడడం కేసీఆర్ కి కష్టమేం కాదు. కానీ తన వారసుడికి పట్టాభిషేకం చేయాలనుకుంటున్న వేళ.., ఈ కష్టాలు ఒకదానినొకటి వచ్చెయ్యడం.., అక్కడక్కడా జనం యాక్టీవ్ అయ్యి తిరుగుబావుటా చేస్తుండడం.., బీజేపీ పోరు ఎక్కువ అవుతుండడం తనకి కొంచెం అజీర్తిగా మారింది..!!

cm kcr big plan for his son and duaghter
cm kcr big plan for his son and duaghter

హైదరాబాద్ లో జరిగింది మరీ కక్కుర్తి..!!

హైదరాబాద్ లో త్వరలో ఎన్నికలున్నయ్. ఆ మజ్లీస్ కి కచ్చితంగా వచ్చే 35 – 40 సీట్లు పట్టుకుని.., తనకు కచ్చితంగా వచ్చే 70 – 85 సీట్లతో పింకు మేయర్, ముస్లిం ఉప మేయర్ వచ్చేస్తారు. ఇది ఖాయమే. కానీ గ్రేటర్ లో ఇప్పుడు టీఆరెస్ నేతల కక్కుర్తి, అవినీతి వ్యవహారాలు కేసీఆర్ కి కూడా చెమటలు పట్టిస్తున్నాయి. గత నెలలో వచ్చిన వరదలను రాజకీయంగా వాడుకుని, ఓట్లు రప్పించుకుందామని ఒక్కో కుటుంబానికి రూ. 10 ఇస్తాం.., బాగా ఇబ్బంది జరిగితే రూ. 50 వేలు, లక్ష అయినా ఇస్తాం అని కేసీఆర్ వరమిచ్చారు. ఈ నేపథ్యంలోనే 3 . 94 లక్షల మంది అర్హులను కూడా గుర్తించారు. నిధులను కూడా రిలీజ్ చేసేసారు. దీనిలో ఇప్పటికే 90 శాతం మందికి డబ్బులు ఇచ్చేసినట్టు అధికారులు రాసుకున్నారు. నేతలు చప్పట్లు కొట్టుకున్నారు. కానీ వాస్తవానికి 40 శాతం మందికి మాత్రమే అందాయి అనేది ఇంటెలిజెన్స్ నివేదిక. దీంతో కేసీఆర్ కి దిమ్మ తిరిగింది. ఈ డబ్బు ఎక్కడికి వెళ్లిందో అంతు చిక్కడం లేదు. మిగిలిన బాధితులకు ఎలా ఇవ్వాలి..? అనేది తెలియడం లేదు. అందుకే ఉన్నపళంగా ఈ వరద సాయం పంపిణీలు నిలిపివేశారు.

దుబ్బాకలో దెబ్బ పడితేనో..!!?

మరోవైపు దుబ్బాకలో దెబ్బ తినే పరిస్థితి కనిపిస్తుంది. ఓటమి లేకపోవచ్చు కానీ.., ఓటమి అంచుల వరకు వెళ్లొచ్చు అనేది విశ్లేషకుల మాట. లేదా టీఆరెస్ ఓడినా అర్చర్యం అవసరం లేదు. ఈ బెంగ కేసీఆర్ ని వెంటాడుతుంది. బయటకు గంభీరంగా మాట్లాడుతున్నప్పటికీ, దుబ్బాకలో ఓడితే టీఆరెస్ నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. పోనీ ఈ ఓటమి భారం హరీష్ రావుపై వేసేసి, అతన్ని బలహీనం చేసేద్దాం అనుకుంటే.., ఒకవేళ హరీష్ ఎదురు తిరిగితే టీఆరెస్ రెండు ముక్కలవ్వడం ఖాయం. అందుకే దుబ్బాకలో చీకట్లోనో, వెలుగులోనో ఏదో ఒకటి చేసేసి, ఓట్లు గుద్దించుకుని.., కనీసం 10 వేలు ఆధిక్యతతో గెలవాలి అనేది కేసీఆర్ లక్ష్యం.

bjp big shock to trs in dubbaka
bjp big shock to trs in dubbaka

మంత్రి.., హీరోయిన్ గొడవ ఎటు పోతుందో..!?

మరో వైపు తన మంత్రివర్గంలో ఓ మంత్రి.., ఓ చోటా హీరోయిన్ తో రాసలీలల చాటింగ్ చేశారని.., బాడీ మసాజ్ అడిగారని వార్తలు తన భజన ఛానెల్ లోనే వచ్చాయి. దీంతో రాష్ట్రంలో చురుకైన వర్గాలు అప్రమత్తమయ్యాయి. పక్క రాష్ట్రాల మీడియా కూడా సదరు మంత్రి, హీరోయిన్ వ్యవహారంపై దృష్టి పెట్టాయి. ఇది ఇక్కడితో ఆగకుండా చాల మంది ప్రముఖులు కూడా అంతర్లీనంగా స్కాండిల్ లో ఉన్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి ఎక్కడ.., ఎలా బ్రేకులు వేయాలి అనేది ఒక సందేహంగా మారింది. కుమార్తె కోసం ఆ మంత్రిని కావాలనే టార్గెట్ చేశారు అనే వాదనలు వస్తున్నాయి.
ఇలా కేసీఆర్ పై ముప్పేట దాడి, ఘాటు వాదనలు వస్తుండడం… అన్నీ తాను అన్నదానికి వ్యతిరేకంగా జరుగుతుండడంతో చుక్కలు కనిపిస్తున్నాయి. ఇవీ కేసీఆరుకి షాకులు తగులుతున్నాయి.