NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM Ramesh: విమాన వివాదంలో సీఎం రమేష్!రచ్చ చేసిన వైసిపి!అది నాది కాదన్న ఎంపీ! మరి ఎవరిదంటే ష్ గప్ చుప్!!

Big Boss Politics: MPs Game between Chandrababu Venkaiah

CM Ramesh: టీడీపీ కీలక నేతగా ఉంటూ రెండుసార్లు రాజ్యసభ సభ్యత్వం దక్కించుకున్న సీఎం రమేష్ మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఓడిపోగానే గోడ దూకేసి బీజేపీ పంచన చేరడం గుర్తుండే ఉంటుంది.నెంబర్ వన్ కాంట్రాక్టర్ గా ఉంటూ రమేష్ అనేక అక్రమాలకు పాల్పడి బాగానే సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి.తన ఆస్తులను రక్షించుకునే ఉద్దేశంతోనే ఆయన బీజేపీలో చేరిపోయారని కూడా టాక్.అయితే ఇదంతా గతం.

CM Ramesh in flight dispute!
CM Ramesh in flight dispute

ఇప్పుడు రమేష్ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే ఆయన ఆదివారం ఒక కొత్త విమానానికి ప్రారంభోత్సవం చేశారు. ఆ విమానం ప్యాసింజర్ లాడర్ ముందు ఆయన కొబ్బరికాయ కొట్టి పూజ చేశారు.తర్వాత విమానం ఎక్కగానే ఎయిర్హోస్టెస్ ఆయనకు విషెస్ చెప్పి సీట్లో కూర్చోబెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.దీంతో రమేష్ సొంతంగా చార్టర్డ్ ఫ్లైట్ కొనుక్కున్నారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. దీనిపై కూడా సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి.

ముందుగా స్పందించిన వైసీపీ!

సీఎం రమేష్ విమాన వ్యవహారంలో ముందుగా వైసిపి స్పందించింది. రమేష్ విమానం కొనుక్కున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ మేరకు వైసీపీ ఐటీ సెల్ ఇన్‌చార్జి గుర్రంపాటి దేవేందర్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలు పోస్టులు పెట్టారు‘‘బీజేపీ స్పెషల్ స్టేటస్ ఇవ్వటం లేదని కోపం వచ్చి.. బీజేపీలో చేరి స్పెషల్ ఫ్లయిట్ కొనుక్కున్న సీఎం రమేష్’’ అంటూ దేవేందర్ రెడ్డి తన పోస్టులో పేర్కొన్నారు. అలాగే ‘‘విమానం కొన్న సీఎం రమేష్! తెలుగుదేశంలో ఉండి దోచుకోండి.. బీజేపీలో చేరి దాచుకోండి.. సొంత విమానం కొన్న  రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్.’’ అంటూ ప్రచారం హోరెత్తించారు.

CM Ramesh: ఆ విమానం స్నేహితుడిదన్న రమేష్!

వివాదం బాగా ముదిరిపోవడంతో సీఎం రమేష్ కార్యాలయం స్పందించింది.ఆ విమానం సీఎం రమేష్ ది కాదని, అతని స్నేహితుడిదని వివరణ ఇచ్చింది.స్నేహితుడి కోరిక మీద రమేష్ ఆ విమానానికి పూజ నిర్వహించారని తెలిపింది.సీఎం రమేష్ ఆ విమానాన్ని కొనుగోలు చేశారన్న వార్త పూర్తిగా సత్యదూరమని స్పష్టం చేసింది.అయితే ఇక్కడే మరో సందేహం మొదలైంది.ఒకవేళ నిజంగానే ఆ విమానాన్ని రమేష్ స్నేహితుడు కొనుగోలు చేసి ఉంటే అతడి పేరు వెల్లడించకుండా గోప్యత పాటించాల్సిన అవసరం ఏముందని కొందరు కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారు.సీఎం రమేష్ అతడి పేరు కూడా చెప్పేస్తే ఏ గొడవా ఉండదు కదా అని వారంటున్నారు.అది నిజమే అనిపిస్తోంది .మరి ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూద్దాం.

 

author avatar
Yandamuri

Related posts

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju