ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు

జాతీయస్థాయిలో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా సమావేశం కోసం కొద్ది సేపటి క్రితం దేశ రాజధాని చేరుకున్నారు. చంద్రబాబు కొద్ది రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఈ రోజు సమావేశానికి దారి తీశాయి. బిజెపి నాయకత్వం లోని ఎన్‌డిఎకు వ్యతిరేకంగా చంద్రబాబు తలపెట్టిన ప్రతిపక్ష ఫ్రంట్‌కు నాందిగా ప్రతిపక్షాలు సమావేశం కావడం ఇదే మొదటిసారి.

12 రాజకీయపార్టీలు ఈ సమావేశంలో పాల్గొటాయని భావిస్తున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది. దానికి ముందు ఫరూక్ అబ్దుల్లా, మమతా బెనర్జీ, సీతారాం ఏచూరి, సురవరం సుధాకర రెడ్డి వంటి నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.