NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

CM Revanth Reddy: మేడారం వనదేవతలను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి .. మహాజాతరపై కేంద్రానికి ఎందుకీ వివక్షత..?

CM Revanth Reddy: మేడారం మహా జాతర వైభవంగా జరుగుతోంది. లక్షలాది మంది భక్తులు వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని బంగారం సమర్పించి తమ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. మేడారం పరిసర ప్రాంతాలు అన్నీ జనసంద్రమైయ్యాయి. మేడారం మహా జాతర సందర్భంగా శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి అమ్మవార్ల ను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ కు అతిథి మర్యాదలతో సత్కరించారు. అనంతరం సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు.

మేడారం మహాజాతర పై కేంద్ర ప్రభుత్వానికి ఎందుకింత వివక్ష అని సీఎం రేవంత్‌ ప్రశ్నించారు. మంత్రి సీతక్క కృషితో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర పండుగగా మేడారం జాతరను ప్రకటించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కుంభమేళాను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా గుర్తించినప్పుడు.. సమ్మక్క- సారలమ్మ జాతరను గుర్తిస్తే తప్పేమిటని ఆయన నిలదీశారు.

దక్షిణాదిన కుంభమేళాకు ప్రాముఖ్యం ఇచ్చినప్పుడు.. ఉత్తరాదిన మేడారం జాతరను కేంద్రం ఎందుకు విస్మరిస్తుందని ప్రశ్నించారు రేవంత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతరకు రావాలని కోరారు. సమ్మక్కను దర్శనం చేసుకోకపోవడం వల్లే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూల్యం చెల్లించుకున్నారని.. బీజేపీకి కూడా అదేగతి పడుతుందని సీఎం రేవంత్ హెచ్చరించారు.

27న మరో రెండు గ్యారంటీల అమలు

ఈనెల 27వ తేదీన మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ ప్రకటించారు. ఉచిత గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. సమ్మక్క – సారలమ్మ ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని అన్నారు. గత ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన ఇక్కడి నుంచే ‘హాత్ సే హాత్’ జోడోయాత్ర ప్రారంభించినట్లు గుర్తుచేశారు.

తమకు పదవులు వచ్చాయంటే అది అమ్మల దీవెనతోనేనని.. అందుకే జాతరకు రూ.110కోట్ల కేటాయించామని వివరించారు. జాతరకు 18 కోట్ల మంది మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి వచ్చారన్నారు. సమ్మక్క – సారలమ్మలను నమ్ముకున్న జనం కోసం వారు అప్పటి పాలకులతో కొట్లాడి అమరులయ్యారని అన్నారు. తాము కూడా అమ్మవార్లనే స్ఫూర్తిగా తీసుకొని ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా తమ ఎజెండాతో ముందుకెళ్తామని సీఎం రేవంత్ అన్నారు.

MLA Lasya Nanditha: అధికార లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలకు సీఎం రేవంత్ ఆదేశం

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N