NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Mega DSC 2024: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ .. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

Mega DSC 2024: తెలంగాణలో నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ ఇచ్చింది. విద్యాశాఖ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హజరయ్యారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గానూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, ల్యాంగ్వేజ్ పండిట్స్, పీఈటీ పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఎదురు చూపులకు ఎట్టకేలకు తెరపడినట్లు అయ్యింది. ఇప్పటికే ప్రిపరేషన్ ప్రారంభించిన నిరుద్యోగులు ఉపాధ్యాయ కొలువల కోసం పుస్తకాలతో కుస్తీపడుతున్నారు.

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం గత బీఆర్అస్ సర్కార్ 5,089 పోస్టులతో 2023 సెప్టెంబర్ 6న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిని ప్రభుత్వం రద్దు చేసింది. అయితే గత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు సుమారు 1.77 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే గత నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత నోటిఫికేష్ ను రద్దు చేసిన అనంతరం  ..రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ మేరకు కొత్తగా మరో 5,973 ఖాళీ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. వీటితో కలిపి మొత్తం పోస్టుల సంఖ్య 11,062కు చేరింది.

పోస్టుల వివరాలు

  • స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629
  • లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 727
  • పీఈటీ పోస్టులు 182
  • ఎస్జీటీ పోస్టులు 6,508
  • స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులు 220
  • ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టు 796

మార్చి 4 నుండి ఏప్రిల్ 2 వరకూ డీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తారు. ధరఖాస్తు రుసుం రూ.1000లు గా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 పట్టణాల్లో ఆన్ లైన్ పద్ధతిలో పరీక్షలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన తేదీలను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. గతంలో దరఖాస్తు చేసిన వాళ్లు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని, కొత్త డీఎస్సీకి వాటిని పరిగణలోకి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్ 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డీఎస్సీ ప్రకటన ను రద్దు చేస్తూ బుధవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Jaya Prada: బీజేపీ మాజీ ఎంపీ, సినీనటి జయప్రదను పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించిన ఉత్తరప్రదేశ్ కోర్టు ..మార్చి 6లోపు కోర్టుకు హజరుపర్చాలని ఆదేశం

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N