పుష్పగిరి పీఠం భూసమస్యల పరిష్కారానికి సీఎం సూచన

 

అమరావతి, డిసెంబర్ 28: నరసరావుపేట మండలం లింగంగుట్ల రైతులు, పుష్పగిరి పీఠానికి మధ్య ఉన్న భూ  సమస్య పరిష్కారానికి వచ్చే క్యాబినెట్‌లో నోట్ పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గత 70, 80 ఏళ్ళుగా మఠానికి, రైతులకు మధ్య ఉన్న సమస్య పరిష్కారానికి స్పీకర్ కోడెల ఆధ్వర్యంలో గ్రీవిన్స్ హలు నందు రైతులు, మఠాధిపతులు సీఎం చంద్రబాబుని శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి స్పీకర్ కోడెల చోరవ తీసుకోవడం సంతోషం.

1784 ఎకరాలకు సంబంధించిన ఈ సమస్య పరిష్కారం కావడం వలన 1684 మంది రైతులకు, మఠానికి లబ్ధిచేకూరుతుంది.

రైతులు, పుష్పగిరిపీఠం, ప్రభుత్వం ఒక అంగీకారానికి వచ్చినట్లు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తే సమస్య పరిష్కరిస్తాం అవుతుందన్నారు. లిటిగేషన్ లేకుండా సమస్య పరిష్కారించుకోవడం ఇద్దరికీ మంచిది. అలాగే చిలకలూరిపేట పరిధిలోని 350ఎకరాల మఠం భూముల సమస్య కూడా పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు.భవిష్యత్‌లో భూసమస్యలు రాకుండా ఆధార్ లాగా భూధార్ ఏర్పాటు చేశామన్నారు.

గత 7, 8 దశాబ్దాలుగా ఉన్న సమస్య పరిష్కారానికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందిచడం సంతోషంగా ఉందని స్పీకర్ కోడెల అన్నారు. హక్కులు పిఠానికి, ఆస్తులు రైతుల దగ్గర ఉండడం వల్ల ఇద్దరూ ఇబ్బందులు పడుతున్నారన్నారు.

అనేక దఫాలుగా  ఇరువర్గీయులతో చర్చలు జరపడం వల్ల పీఠం వారు హక్కులను రైతులకు ఇవ్వడానికి అంగీకరించారన్నారు.

రైతులు సైతం రిజిస్ట్రేషన్ వాల్యూలో 13శాతం మఠానికి కానుకగా ఇవ్వడానికి ఒప్పుకున్నారని చెప్పారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి, మంత్రులు పత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.