NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Jagan Attack Case: జగన్ పై హత్యాయత్నం కేసులో కీలక పరిణామం .. అనుమానితుడు దుర్గారావు విడుదల

Jagan Attack Case: విజయవాడ లో ఇటీవల సీఎం వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసులో సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన టీడీపీ నాయకుడు దుర్గారావును అనుమానితుడుగా పోలీసులు అదుపులోకి తీసుకోవడం తీవ్ర సంచలనం అయిన విషయం తెలిసిందే. కేసులో ఇప్పటికే సతీష్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో నెల్లూరు జైల్ కు తరలించారు.

అయితే ఈ కేసులో అనుమానితుడుగా టీడీపీ నాయకుడు వేముల దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురైయ్యారు. దుర్గారావును అక్రమంగా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సీపీ కార్యాలయం వద్ద ఆందోళన కూడా చేశారు. అదుపులోకి తీసుకున్న దుర్గారావును తమకు చూపాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. కుల సంఘాల నేతలు కూడా దుర్గారావు కుటుంబానికి మద్దతుగా నిలిచారు.

పోలీసుల నుండి సరైన సమాధానం రాకపోవడంతో సోమవారం నాడు హైకోర్టులో హెబియస్ కార్ఫస్ పిటిషన్ దాఖలునకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో తమ అదుపులో ఉన్న వేముల దుర్గారావును శనివారం రాత్రి పోలీసులు విడిచిపెట్టారు. విజయవాడ నార్త్ ఏసీపీ కార్యాలయంలో దుర్గారావును కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ సందర్భంలో 160 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చి, మళ్లీ అవసరమైతే స్టేషన్ కు పిలుస్తామని చెప్పి సంతకాలు తీసుకున్నారు.

విడుదలైన అనంతరం దుర్గారావు మాట్లాడుతూ.. ‘ఈ నెల 16న సింగ్ నగర్ డాబా కొట్ల రోడ్డు లోని టీ కొట్టు వద్ద టీ తాగుతున్న సమయంలో పోలీసులు వాహనంలో ఎక్కించుకుని తీసుకువెళ్లారన్నారు.  తనను ఇంటరాగేషన్ చేశారన్నారు. నేను ఏ తప్పు చేయలేదన్నాను. నీ వెనుక ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అసలు నేను ఆ పని చేయనప్పుడు ఎవరుంటారని జవాబు ఇచ్చాను. సీసీఎస్ లో నన్ను, సతీష్ ను పక్క పక్క గదిల్లో ఉంచి విచారణ చేశారు. పోలీసులు నా వద్దకు వచ్చి జగన్ పై  రాయి వేస్తే రూ.1000 ఇస్తానన్నావట కదా అని అడిగారు. సతీష్ నాకు పరిచయం లేదని చెప్పాను. దీంతో ఇద్దరినీ కలిపి విచారించారు. నేను నిర్దోషినని పోలీసులకు అర్ధమైంది. అందుకే నన్ను వదిలిపెట్టారు’ అని దుర్గారావు వివరించారు.

ముందుగా నన్ను విజయవాడ సీసీఎస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకూ అక్కడే ఉంచారు. తర్వాత మైలవరంలోని సీఐ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకూ ఉంచారు. ఆక్కడి నుండి మళ్లీ విజయవాడ సీసీఎస్ స్టేషన్ కు తెచ్చారు. రాత్రి కుటుంబ సభ్యులకు అప్పగించారు దుర్గారావు అని తెలిపారు.

BRS: కేసిఆర్ పై కీలక నేత సంచలన వ్యాఖ్యలు

 

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N