ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

వేల్పుల సచివాలయ కాంప్లెక్స్ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ .. ఈ ప్రాంగణం ప్రత్యేకత ఏమిటంటే..?

Share

వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో ఉన్న ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వేముల మండలం వేల్పుల సచివాలయ ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ ప్రాంగణం ప్రత్యేకత ఏమిటంటే .. ఈ సచివాలయ కాంప్లెక్స్ రాష్ట్రంలో ఆదర్శంగాా నిలుస్తొంది. కడప – పులివెందుల ప్రధాన రహదారి పక్కన వేల్పుల వద్ద రూ.3 కోట్ల 52 లక్షలతో ఒకే ప్రాంగణంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ క్లినిక్, వ్యవసాయ సహకార పరపతి సంఘం, డిజిటల్ లైబ్రరీ, పోస్టాఫీసు, శుద్ధనీటి కేంద్రం, ఓవర్ హెడ్ ట్యాంక్, ఆధునిక వసతులతో బస్ షెల్టర్ నిర్మించారు. తొలుత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ, దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహాలను సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం సచివాలయ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేయనున్నారు.

 

రేపు ఉదయం ఇడుపులపాయ గెస్ట్ హౌస్ నుండి 9 గంటలకు వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించి, ప్రత్యేక ప్రార్ధనల్లో సీఎం జగన్ పాల్గొంటారు. ఆ తరువాత పది గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ ఇడుపులపాయలో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి పనులపై అధికారులతో, నేతలతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 5.10 గంటలకు గెస్ట్ హౌస్ కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఎల్లుండి 3 వతేదీ ఉదయం ఇడుపులపాయ గెస్ట్ హౌస్ నుండి రోడ్డు మార్గంలో హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుండి హెలికాఫ్టర్ లో 9.15 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 9.20 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడ నుండి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రోడ్డుమార్గంలో చేరుకుంటారు.

టీడీపీ ఆశలపై నీళ్లు చల్లిన ఏపీ బీజేపీ కో ఇన్ చార్జి సునీల్ ధియోదర్.. మ్యాటర్ ఏమిటంటే..?


Share

Related posts

Rana Daggubati: ‘భీమ్లా నాయక్’ సీక్వెలా..అంత సీన్ లేదన్న రానా కామెంట్స్ వైరల్..!

GRK

Pawan Kalyan : తన స్పీచ్ తో రికార్డుల వేట స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్..!!

sekhar

Employees Protest: ఆర్ధిక మంత్రి బుగ్గన పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఉద్యోగ సంఘాల నేత..!!

somaraju sharma