NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: 15న వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక భీటీ..!? ఎందుకంటే..!?

YS Jagan Cabinet: Roja VS Peddireddy Tens to Jagan

YSRCP: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వెయ్యి రోజులు దాటింది. అయితే ఇప్పటి వరకూ ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాల అమలుపైనే సీఎం జగన్ దృష్టి పెట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ఆ క్రమంలో 90 శాతం నేరవేర్చారు. అయితే అభివృద్ధి కుంటుపడిందనే మాట వినబడుతోంది. దీంతో కొన్ని వర్గాల్లో ప్రభుత్వంపై, వైసీపీపై కొంత అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే రెండేళ్లలో ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలి అనే దానిపై సీఎం జగన్ దృష్టి పెట్టినట్లు సమాచారం.

CM YS Jagan key meeting YSRCP mlas
CM YS Jagan key meeting YSRCP mlas

YSRCP: 15వ తేదీ వైసీపీ ప్రజాప్రతినిధులతో భేటీ

ఈ క్రమంలోనే ఈ నెల 15వ తేదీన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్ చార్జిలు, ముఖ్యనేతలతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారని విశ్వసనీయ సమాచారం. ఉగాది లోపుగా మంత్రి వర్గ ప్రక్షాళన కూడా చేయనున్న నేపథ్యంలో జిల్లాల్లో ఎవరెవరికి మంత్రి వర్గంలో అవకాశం కల్పించాలి. వైసీపీ ప్లీనరీ, జిల్లాల విభజన, ఈ రెండేళ్లు ప్రజా ప్రతినిధులు, నేతలు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి తదితర విషయాలపై చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. రాజకీయంగా వైసీపీ ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగాలి అనే వాటిపై జగన్ దిశానిర్ధేశం చేయనున్నారు.

 

YSRCP: బ్యాడ్ ఫీడ్ బ్యాక్ ఉన్న వాళ్లతో..

ఆ భేటీ అనంతరం ఏయే నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులపై బ్యాడ్ ఫీడ్ బ్యాక్ ఉందో వాళ్లను నేరుగా జిల్లా ఇన్ చార్జిలు, రాష్ట్ర ముఖ్యనేతలు పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి మాట్లాడతారని సమాచారం. ఈ నెల 25వ తేదీ వరకూ శాసనసభ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే అందుకే 16వ తేదీ నుండి 25వ తేదీ వరకూ ప్రజల్లో వ్యతిరేకత ఉన్న 20 – 30 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ముఖ్యనేతలు నేరుగా సమావేశాలు నిర్వహించున్నారని సమాచారం. క్షేత్ర స్థాయిలో వారిపై ఉన్న వ్యతిరేకత పొగొట్టుకునేందుకు వారు ఏమి చేయాలి. పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు చేపట్టాలని తదితర అంశాలపై సూచనలు, సలహాలు అందిస్తారుట.

2024 ఎన్నికల్లోనూ గెలుపే లక్ష్యం

2024 ఎన్నికల్లోనూ గెలుపే లక్ష్యంగా పని చేయాలంటే వైసీపీ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలి అనే వాటిపై దృష్టి పెట్టనున్నారు. ఇప్పటి వరకూ జగన్మోహనరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడిన సందర్భం లేదు. కొందరు ఎమ్మెల్యేలు మాత్రమే అడపదడపా జగన్మోహనరెడ్డితో భేటీ అయ్యారు. ఈ నెల 15వ తేదీ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్ చార్జిలతో జగన్ భేటీ కానున్నారని వార్తలు రావడం, ఇది మొదటి సారి జరుగుతుండటంతో ప్రాధాన్యతను సంతరించుకోబోతున్నది అంటున్నారు. ఇప్పుడు జరగబోతున్న ఈ తతంగం మొత్తం చూసుకుంటే రాబోయే ఎన్నికలకు వైసీపీ సన్నద్దం అవుతున్నట్లు కనబడుతోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju