Ys Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనితనం విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు.

ఒకపక్క ప్రభుత్వ అధికారులకు స్వేచ్ఛ చేస్తూనే మరోపక్క ప్రజాప్రతినిధులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించి అమలవుతున్న పథకాలు గురించి అదే రీతిలో వాటి పని తనం గురించి ప్రజలతో నిత్యం టచ్ లో ఉండేవిధంగా ఎమ్మెల్యేలు ఉండాలని మొదటి నుంచి జగన్ చెబుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే ఇటీవల ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతానికి చెందిన 51 మంది ఎమ్మెల్యేల పనితనం సరిగ్గా లేదని జగన్ దృష్టికి వచ్చిందట. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పనితనం గురించి జగన్ సీక్రెట్ రిపోర్ట్ సర్వే చేయించుకొని వాటి ఫలితాల ఆధారంగా ఈ 51 మందికి జగన్..లేటెస్ట్ గా ఒక్కొక్కరికి క్లాస్ తీసుకుని మరీ చెమటలు పట్టించారు అట. రాబోయే రోజుల్లో ఈ విధంగానే ఇష్టానుసారంగా నియోజకవర్గంలో వ్యవహరిస్తే.. వచ్చే ఎన్నికలకు టికెట్ కష్టం అనే రీతిలో జగన్ హాట్ వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో పనితీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారట. అసలు ఈ 51 మంది ఎమ్మెల్యేలు ప్రజలలోకి వెళ్ళటం గాని అదేవిధంగా ప్రభుత్వం యొక్క పనితీరు అమలవుతున్న పథకాల గురించి గానీ అసలు పట్టించుకోవడం లేదని జగన్ దృష్టికి రావడంతో.. జగన్ విల్ అందరికి ఒక రౌండ్ వేసుకున్నట్లు మీడియా సర్కిల్స్ లో కూడా ఈ వార్త వైరల్ అవుతుంది. ఏది ఏమైనా నియోజకవర్గంలో ప్రజలకు మాత్రం ఎమ్మెల్యేలు ఎప్పుడు అందుబాటులో ఉండాలని.. జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలకు తాజాగా ఆదేశాలు జారీ చేయడం జరిగిందట. నిత్యం వాళ్ళతో టచ్ లో ఉంటూ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించినట్లు సమాచారం.