NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

YSRCP: ప్రత్యర్ధులు రాయి విసిరినంత మాత్రాన మీ బిడ్డ అదరడు బెదరడు అని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అన్నారు.   గుడివాడలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. అర్జునుడిపై ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్రంలో గెలుపు కౌరవులు నెగ్గినట్లు కాదన్నారు. తన నుదుటి మీద చేసిన గాయంతో సంకల్పం మరింత పెరిగిందని అన్నారు. ఎన్నికల సంగ్రామంలో చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ తన పైన దాడికి దిగుతున్నారని అన్నారు.

ఆ దేవుడు నా నుదుట మీద పెద్ద స్క్రిప్ట్ రాశాడన్నారు. ఒక్క జగన్ పై ఎంత మంది దాడి చేస్తున్నారో అందరూ చూశారని అన్నారు. తనపై రాయి దాడి జరిగిన తర్వాత తొలిసారి గుడివాడలో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. జరగబోయే కురుక్షేత్రంలో ఆ దుష్టచతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వ గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు అని అన్నారు. పైగా ఈ స్థాయికి దిగజారారు అంటే .. విజయానికి మనం అంత చేరువగా ఉన్నామని, వారు విజయానికి అంత దూరంగా ఉన్నారనే కదా అని అర్ధమని అన్నారు.

పేదలకు మంచి చేయకూడదని చంద్రబాబు భావించి అనేక కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.  పేదలకు ఇంగ్లీష్ మీడియం అందిస్తుంటే వద్దన్నదీ, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే అడ్డుపడిందీ ఈ చంద్రబాబు కాదా  అని జగన్ ప్రశ్నించారు. రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వవద్దని చెప్పిందీ కూడా ఈ చంద్రబాబేనని అన్నారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి, ఆయనకుర్చీని లాక్కుని, ఆయన ప్రాణం పోవడానికి కారణమైన చంద్రబాబు అని అందరికీ తెలుసునని అన్నారు. ఎన్నికలకు వచ్చినప్పుడల్లా రామారావు ఫొటో తీసి జనంలోకి రావడం చంద్రబాబు ఒక్కడికే సాధ్యమని జగన్ ఎద్దేవా చేశారు.

దొంగ వాగ్దానాలతో ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు. కృష్ణా, గోదావరి జిల్లాలో దొంగచేతికి తాళాలివ్వడమే అన్నట్లుగా చంద్రబాబును నమ్మితే మళ్లీ మోసపోయినట్లేనని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన యాభై ఎనిమిది నెలల కాలంలో ఎంత మార్పు వచ్చిందో గమనించాలని జగన్ కోరారు. గ్రామ గ్రామాన సచివాలయాలను ఏర్పాటు చేశామని అన్నారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సంక్షేమంలో ఎవరికీ అందని విధంగా 2.75 లక్షల కోట్ల రూపాయలను లబ్దిదారులకు నేరుగా అందచేశామని తెలిపారు.

మీ బ్యాంకు అకౌంట్లను పదేళ్లలో పరిశీలిస్తే ఎవరి హయాంలో మంచి జరిగిందో అర్థమవుతుందని అన్నారు. జగన్ మార్కు అభివృద్ధి ప్రతి గ్రామంలో కన్పిస్తుందని చెప్పారు. 2014 లో చంద్రబాబు అండ్ కో కూటమిగా ఏర్పడి ప్రజలను మోసం చేసిన వైనాన్ని ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని శ్రేణులకు సూచించారు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మన బ్రతుకులు బాగుంటాయనే ఆలోచన చేయాలని అన్నారు. అలా ఆలోచన చేసి ప్యాన్ కు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటికి అభివృద్ధి కొనసాగుతుందనే విషయం గుర్తు పెట్టుకోవాలని జగన్ అన్నారు.

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?