NewsOrbit
న్యూస్

YS Jagan: దావోస్ సమ్మిట్ కు హాజరు కానున్న సీఎం!దమ్ము చూపి దుమ్మురేగేలా జగన్ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తెస్తారని అంచనాలు!

YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రప్పించే ప్రయత్నాలు మొదలెట్టారు.ఇందులో భాగంగా మే 22 నుండి 26 తేదీ వరకు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సమావేశానికి సీఎం జగన్ పదిహేడు మంది ప్రతినిధులతో కూడిన బృందంతో సహా హాజరు కానున్నారు.

CM YS Jagan to attend Davos summit
CM YS Jagan to attend Davos summit

YS Jagan: సీఎంను ఆహ్వానించిన ఫోరం ప్రెసిడెంట్ !

ఇటీవల అకాల మరణం చెందిన ఆంధ్రప్రదేశ్ దివంగత పరిశ్రమల శాఖ మేకపాటి గౌతం రెడ్డి ద్వారా సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా ఫోరం అధ్యక్షుడు బోర్జు బ్రిండే చాలాకాలం క్రితమే ఆహ్వానం పంపారు. ఈ సందర్బంగా ఆయన జగన్ దీక్షా దక్షతలను ప్రశంసించారు.తప్పనిసరిగా ఈ సమావేశానికి రావాలని ఆయన మరోసారి కూడా కోరడంతో ముఖ్యమంత్రి జగన్ ఇందుకు అంగీకారం తెలిపారు. వాస్తవానికి ఈ సమ్మిట్ ప్రతి ఏడాది జనవరిలో జరగటం ఆనవాయితీ.కానీ కరోనా కారణంగా ఇది వాయిదా పడుతూ వస్తోంది.చివరకు వచ్చే నెలలో ఈ సదస్సు దావోస్ లో జరగబోతోంది.జగన్ ముఖ్యమంత్రి అయ్యాక జరుగుతున్న ఫోరం తొలి సమావేశం కూడా ఇదే.

CM YS Jagan to attend Davos summit
CM YS Jagan to attend Davos summit

YS Jagan: నిపుణులతో కూడిన ప్రతినిధి బృందం!

విదేశీ పెట్టుబడులు రాబట్టడంలో దావోస్ సమ్మిట్ కు ఒక ప్రత్యేక స్థానం ఉన్నందున అక్కడికి తనతో పాటు వివిధ రంగాల నిపుణులను తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించుకున్నారు.సీఎంఓ కార్యాలయ సీనియర్ అధికారులతో పాటు పరిశ్రమల శాఖకు చెందిన సలహాదారులను కూడా జగన్ తన వెంట తీసుకువెళ్తున్నారు.ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం పదిహేడు మందితో కూడిన ప్రతినిధి బృందం సీఎంతో పాటు దావోస్ లో పర్యటించనున్నది.

టిడిపి నోరు మూయించేలా!

దావోస్ సమ్మిట్ కు హాజరుకావడం ద్వారా విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి తెప్పించి తెలుగుదేశం పార్టీ నోరు మూయించేలా జగన్ పక్కా ప్రణాళికను తయారు చేసుకున్నట్లు ఉన్నత స్థాయి అధికార వర్గాల ద్వారా తెలిసింది.జగన్ ప్రభుత్వ హయాంలో ఒక్క విదేశీ కంపెనీ కూడా ఆంధ్రాకు రాలేదని,ఉన్నవి కూడా వెళ్లిపోయాయని టీడీపీ చేస్తున్న విమర్శలకు మాటల ద్వారా గాక చేతల ద్వారానే దావోస్ సమ్మిట్ రూపంలో జగన్ సమాధానం చెప్పబోతున్నారని వైసిపి వర్గాలు కూడా అంటున్నాయి.

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో సీఎం రెడీ

ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడమే కాకుండా పాలనాపరంగా తాను తెచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి కూడా ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించబోతున్నారని ఆ వర్గాలు తెలిపాయి.దేశంలో ఎక్కడా లేనివిధంగా తాను అమలుచేస్తున్న వాలంటరీ,సచివాలయ వ్యవస్థల గురించి,వాటి కారణంగా ఒనగూరుతున్న ప్రయోజనాల గురించి సీఎం ఆ సదస్సులో వివరించబోతున్నారని,ఇవి పారిశ్రామికవేత్తలకు కూడా పనికి వచ్చే ప్రభుత్వ అంతర్భాగాలని వారికి బోధపడేలా చేయబోతున్నారని ఆ వర్గాలు వివరించాయి.ఇవన్నీ తప్పనిసరిగా విదేశీ పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుని వారిని ఆంధ్రప్రదేశ్ బాట పట్టిస్తాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

 

author avatar
Yandamuri

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N