CM YS Jagan Visakha Tour: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి నేడు విశాఖ పర్యటనకు వెళుతున్నారు. అయితే ఈ పర్యటనలో ఓ ప్రత్యేకత ఉండి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విశాఖలో నేచురోపతి చికిత్స తీసుకుంటున్న హరార్యనా ముఖ్యమంత్రి మనోహర్ ఖట్టర్ తో భేటీ అయ్యేందుకు సీఎం జగన్ వెళుతున్నారు. ఉదయం 11.10 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్న ఏపి సీఎం వైఎస్ జగన్ అక్కడ సుమారు గంట పాటు జిల్లా నాయకుల తో సమావేశం అవుతారు. అనంతరం రుషి కొండలోని ఫెమా వెల్ నెస్ సెంటర్ కు వెళ్లి అక్కడ ఉన్న హర్యానా సీఎం ఖట్టర్ తో భేటీ కానున్నారు. ఖట్టర్ తో సమావేశం అనంతరం 1.20 గంటలకు జగన్ తాడేపల్లి కి తిరుగు ప్రయాణం అవుతారు.
అయితే సీఎం జగన్ ప్రత్యేకంగా విశాఖకు వెళ్లి చికిత్సలో ఉన్న హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ ఖట్టర్ తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఎందుకంటే ఖట్టర్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితమైన నేత అని అందరికీ తెలుసు. జగన్ ఇప్పుడు ఆయనను ప్రత్యేకంగా కలుస్తున్నారు అంటే రాజకీయంగా ప్రాధాన్యత కల్గి ఉండవచ్చని భావిస్తున్నారు. బీజేపీకి చెందిన భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాష్ట్రానికి అనేక పర్యాయాలు వచ్చిన సందర్భంలోనూ మర్యాదపూర్వకంగానూ కలవని ఏపి సీఎం జగన్.. రాష్ట్రానికి విచ్చేసిన బీజేపీకి చెందిన మరో రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుస్తుండటం గమనార్హం. త్వరలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న వేళ జగన్-ఖట్టర్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Acharya: కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).. రామ్ చరణ్(Ram Charan) ఫస్ట్ టైం లాంగ్ లెన్త్ రోల్…
Rana: దగ్గుబాటి రానా(Rana) హీరోగా మాత్రమే కాదు అన్ని రకాల పాత్రలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం…
Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…