భారత్ లో విశేష ప్రాచుర్యం పొందిన ‘కేఫ్ కాఫీ డే’ పలు ఔట్ లెట్లను మూసి వేసింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ కాలంలో దాదాపు 500 ఔట్ లెట్లు మూసీసిన కంపెనీ.. ఈ ఏడాది మొదటి క్వార్టర్ లో మరో 280 మూసి వేసినట్లు తెలుస్తోంది. ఇందుకు లాభాలు తగ్గడం, ఖర్చులు పెరగడం వంటి పలు అంశాలు కారణమయ్యాయని తెలుస్తోంది. దీంతో ఈ జూన్ నెలాఖరుకు ‘కేఫ్ కాఫీ డే’ ఔట్ లెట్స్ సంఖ్య 1,480కి చేరుకుంది.
ఈ ఏడాది తొలి క్వార్టర్ కు డైలీ యావరేజ్ సేల్స్ 15,445గా ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య తగ్గడం, లాభాలు, వర్కంగ్ క్యాపిల్ రిక్వైర్ మెంట్స్, వంటి పలు అంశాలు కారణమయ్యాయని అంటున్నారు. దీంతో ఎగుమతులు కూడా నిలిపేశారు. భవిష్యత్ వ్యాపారాభివృద్ధి, మిగిలిని ఔట్ లెట్స్ లాభాల్లో నడవడం వంటి అంశాల గురించే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఔట్ లెట్స్ తగ్గినా వెండింగ్ మిషన్స్ గత క్వార్టర్ లో 49,397 ఉండగా ఈ ఏడాదికి దాదాపు 10వేలు పెరిగాయి.
గత ఏడాది సంస్థ అధినేత వీజీ సిద్ధార్ధ ఆత్మహత్య చేసుకునే సమయానికి అప్పులు రూ.4,970గా ఉన్నాయి. వాటన్నింటినీ కాఫీ డే గ్లోబల్ నాన్-కోర్ అసెట్స్ అమ్మకం ద్వారా రుణాలు క్రమంగా తీరుస్తోంది. టెక్నాలజీ బిజినెస్ పార్క్ విక్రయంపై బ్లాక్ స్టోన్ గ్రూప్ తో ఇటివల డీల్ కుదిరింది. దీంతో 13 రుణ సంస్థలకు రూ.1644 కోట్ల రుణాలు చెల్లించినట్టు కాఫీ డే తెలిపింది.