NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కొట్టుకుఛస్తున్నారు :: వైసీపీ లో MLA vs Ex MLA – ఓపెన్ వార్ !! 

ఏపీలో అధికార వైసీపీలో లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయా? ఎమ్మెల్యేలు వ‌ర్సెస్ మాజీలు…. వైఎస్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌లు వ‌ర్సెస్ ఇటీవ‌ల పార్టీలోకి వ‌చ్చిన నాయ‌కులు అన్న‌ట్లుగా ప‌రిస్థితి మారిపోయిందా?

ఓ వైపు ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్ సంక్షేమం, అభివృద్ధి అజెండాతో ముందుకు సాగుతుంటే వివిధ జిల్లాల్లో మాత్రం నేత‌లు విబేధాలతో ర‌చ్చ‌కు ఎక్కుతున్నారా? ప్ర‌స్తుతం కొన్ని జిల్లాల్లోని ప‌రిస్థితుల‌ను చూస్తుంటే…ఈ సందేహాలు నిజ‌మేన‌ని అనిపిస్తోంది.

ఎమ్మెల్యే వ‌ర్సెస్ మాజీ ఎమ్మెల్యే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డం కోసం ఇన్నాళ్లు శ్ర‌మించిన నేత‌ల‌కు ఇప్పుడు కొత్త నేత‌ల రూపంలో షాక్‌లు త‌గులుతున్నాయ‌ట‌. ప్ర‌కాశం జిల్లాలో ఈ ప‌రిస్థితులు ఉన్నాయంటున్నారు. ఇదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒక‌రు వైసీపీ నేత‌ల‌ను కాద‌ని ప‌క్క పార్టీ నేత‌కు ప‌ద‌వులు ఇవ్వ‌డం వివాదానికి కార‌ణంగా మారిన విష‌యం ఇంకా స‌ద్దుమ‌ణ‌గ‌క ముందే, మ‌రో ఎమ్మెల్యే వైఖ‌రి క‌ల‌క‌లం రేపుతోంది. ద‌ర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ టీడీపీ నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్గం నేతలు వైఎస్ఆర్‌సీపీ పెద్ద‌ల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం.

వైసీపీ స‌ర్కారులో టీడీపీ అభిమానుల‌కే లాభం?
తాము క‌ష్ట‌ప‌డ్డ పార్టీ అధికారంలోకి వ‌స్తే బ‌డా నాయ‌కుల నుంచి మొద‌లుకొని చోటా నేత‌ల దాకా త‌మ త‌మ స్థాయిల్లో ప‌ద‌వులు ఆశిస్తారు. వివిధ ర‌కాల ప‌నులు చేసుకోవాలని ప్ర‌య‌త్నిస్తుంటారు. అధినాయ‌క‌త్వం సైతం అదే విధంగా వారికి న్యాయం చేస్తుంది. అయితే ద‌ర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ మాత్రం టీడీపీ నేత‌ల‌కే పెద్ద పీట వేస్తున్నార‌ని వైసీపీ సీనియ‌ర్లు కొంద‌రు హ‌ర్ట‌వుతున్నార‌ట‌. ఇదే విష‌యాన్ని మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకుపోయిన‌ట్లు స‌మాచారం. దీంతో మాజీ ఎమ్మెల్యే ఆ వివ‌రాల‌న్నీ సేక‌రించార‌ట‌.

మాకే ఎందుకు ఇలా జ‌రుగుతోంది?
ఎమ్మెల్యే వేణుగోపాల్ ఏ విధంగా టీడీపీ నుంచి వ‌చ్చిన‌ నేత‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్న‌ది, అందులోనూ ఒకే సామాజిక‌వ‌ర్గం వారికే మేలు చేస్తున్న వివ‌రాల‌ను స‌మ‌గ్రంగా సేక‌రించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత వైవీ సుబ్బారెడ్డికి అందించార‌ట‌. పార్టీ కోసం మొద‌టి నుంచి క‌ష్ట‌ప‌డిన వారికి పదవులు, కాంట్రాక్టులు దక్కడం లేదని పేర్కొన‌డమే కాకుండా ప్రధానంగా ఆదాయం ఒనగూరే పనులన్నీ టీడీపీ వారికే కట్టబెడుతున్నారనే విష‌యాన్ని మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి వర్గం వైవీ సుబ్బారెడ్డి దృష్టికి తీసుకువెళ్లింద‌ట‌.

వైవీ సుబ్బారెడ్డి ఎంట్రీ ఇవ్వ‌డంతో….

నియోజ‌క‌వ‌ర్గం స్థాయిలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మ‌ధ్య జ‌రుగుతున్న ఈ కోల్డ్ వార్ నేప‌థ్యంలో వైవీ సుబ్బారెడ్డి జోక్యం చేసుకొని బూచేప‌ల్లి వ‌ర్గానికి స‌ర్దిచెప్పిన‌ట్లు స‌మాచారం. పార్టీ కోసం శ్ర‌మించిన వారికి త‌గు న్యాయం చేస్తాన‌ని భ‌రోసా ఇచ్చిన‌ట్లు టాక్ న‌డుస్తోంది. అయితే, వైసీపీ ము్య‌నేత‌, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డిని మాజీ ఎమ్మెల్యే బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డి వ‌ర్గం క‌ల‌వ‌డం, త‌న గురించి ఫిర్యాదు చేసిన నేప‌థ్యంలో ద‌ర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ సైతం అల‌ర్ట్ అయిన‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఆయ‌న వైవీ సుబ్బారెడ్డిని క‌లిసి త‌ను తీసుకున్న నిర్ణ‌యాలు, క్షేత్ర‌స్థౄయిలో వాస్త‌వ ప‌రిస్థితిని వివ‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కాగా, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మ‌ధ్య వైరం వైసీపీ శ్రేణుల‌ను మాత్రం ఆందోళ‌న‌కు గురి చేస్తోంద‌ని స్థానికంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

 

author avatar
sridhar

Related posts

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N