కమెడియన్ వేణు తెలుసు కదా. ఈటీవీలో జబర్దస్త్ స్టార్ట్ చేసినప్పుడు కామెడీ షోను ఓ రేంజ్ కు తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర పోషించింది వేణునే. అప్పట్లో వేణు, ధన్ రాజ్, చమ్మక్ చంద్ర స్కిట్లను చూసి జనాలు తెగ నవ్వుకునేవారు. ఇప్పుడంటే హైపర్ ఆది, ఇమ్మాన్యుయేల్, సుధీర్ వచ్చారు కానీ.. అప్పుడు వీళ్లే తెలుగు కామెడీకి దిక్కు. అందుకే.. వీళ్లను తెలుగు బుల్లితెర కామెడీ రంగంలో పిల్లర్స్ గా చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం వేణు సినిమాల్లో కామెడీ వేషాలు వేస్తూనే.. జీతెలుగులో బొమ్మ అదిరింది అనే కామెడీ షోలో స్కిట్లు చేస్తున్నారు. అలాగే నాగబాబు యూట్యూబ్ చానెల్ లో ప్రసారం అవుతున్న ఖుషీ ఖుషీగా అనే స్టాండప్ కామెడీ చానెల్ లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
మొత్తం మీద వేణు తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరయ్యాడు. ఇంకాస్త దగ్గరయ్యేందుకు.. అదేనండి.. కామెడీని ఇంకా పంచేందుకు అది కూడా తన కొడుకు రేవంత్ తో కలిసి కామెడీని పంచేందుకు సిద్ధమయ్యాడు వేణు. అందుకే.. యూట్యూబ్ లో ఒక చానెల్ ను పెట్టి అందులో తన కొడుకుతో కలిసి కామెడీని పంచుతున్నాడు. ఈ చానెల్ ను సుడిగాలి సుధీర్ లాంచ్ చేశాడు. మొదటి ఎపిసోడ్ ను కూడా ఇటీవలే అప్ లోడ్ చేశారు.
మరి.. వేణు తన కొడుకుతో కలిసి ప్రేక్షకులను నవ్వించాడో లేదో ఈ వీడియో చూసి తెలుసుకోండి.