Comedy Stars : కామెడీ స్టార్స్ Comedy Stars ప్రోగ్రామ్ గురించి తెలుసు కదా. కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ ప్రస్తుతం టీఆర్పీలో దూసుకుపోతోంది. అంతే కాదు.. ఈటీవీ జబర్దస్త్ కు, బొమ్మ అదిరిందికి గట్టి పోటీని ఇస్తోంది. ఇటీవలే స్టార్ మాలో ప్రారంభం అయినా.. టీఆర్పీలో దూసుకుపోతుండటంతో.. రెట్టించిన ఉత్సాహంతో ఈ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తున్నారు.

కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ ప్రత్యేకతే ఏంటంటే.. ప్రతి ఎపిసోడ్ లో ఖచ్చితంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లు వచ్చి సందడి చేస్తున్నారు. దీంతో ఈ షోకు పాపులారిటీ విపరీతంగా వస్తోంది.బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ అవినాష్ ఎలాగూ ఈ షోలో టీమ్ లీడర్ ఉండటంతో.. ఆయన స్కిట్ లో చేయడం కోసం బిగ్ బాస్ 4, 3 కంటెస్టెంట్లు క్యూ కడుతున్నారు. ఇప్పటికే అవినాష్ టీమ్ లో బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ అషు రెడ్డి, బిగ్ బాస్ 4 కంటెస్టంట్లు సుజాత, అరియానా చేస్తున్నారు. మరో నటి సిరి కూడా అవినాష్ టీమ్ లో చేస్తోంది.
Comedy Stars : కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ లో దర్శనమిచ్చిన సోహెల్
అయితే.. లేటెస్ట్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ సోహెల్ దర్శనమిచ్చాడు. అవినాష్ స్కిట్ లో ఓ పాత్ర చేసిన సోహెల్.. స్టేజ్ మీద రెచ్చిపోయాడు. అరియానా కూడా అదే స్కిట్ లో చేయడంతో మరోసారి సోహెల్, అరియానా.. ఇద్దరూ స్టేజ్ మీద కొట్టేసుకున్నారు.
అవినాష్ ఎంత చెబుతున్నా వినకుండా.. ఇద్దరూ స్టేజ్ మీదనే బిగ్ బాస్ హౌస్ లో తిట్టుకున్నట్టు తిట్టేసుకున్నారు. అయితే.. ఇదంతా స్కిట్ లో భాగమే కాబట్టి.. అందరూ లైట్ తీసుకున్నారు. మొత్తం మీద సోహెల్, అరియానా మరోసారి కామెడీ స్టార్స్ స్టేజ్ మీద కనువిందు చేశారు.దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా కామెడీ స్టార్స్ ప్రోమోను చూసేయండి.
https://www.youtube.com/watch?v=G9N9ijT485U