ట్రెండింగ్ న్యూస్ సినిమా

Comedy Stars : ఇంట్లో ఏం చేతగాదు.. స్టేజ్ మీద మాత్రం బాగానే చేస్తాడు.. అవినాష్ ను ఆడుకున్న సుజాత? English Title : Comedy S

Comedy Stars ఇంట్లో ఏం చేతగాదు స్టేజ్ మీద మాత్రం బాగానే చేస్తాడు అవినాష్ ను ఆడుకున్న సుజాత
Share

Comedy Stars : కామెడీ Comedy Stars స్టార్స్ ప్రోగ్రామ్ గురించి తెలుసు కదా. కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ స్టార్ మా టీవీలో ఇటీవలే ప్రారంభం అయినా.. దానికి బాగానే పాపులారిటీ వచ్చింది. జబర్దస్త్ కు దీటుగా ఈ షోను తీసుకొచ్చారు. జబర్దస్త్ లో స్కిట్లు చేసిన చమ్మక్ చంద్ర, ముక్కు అవినాష్, ఇంకా హరి, యాదమ్మ.. వీళ్లంతా కలిసి చేసే ఫన్ మామూలుగా ఉండదు.

Comedy Stars : Jordar Sujatha punches to mukku avinash
Comedy Stars : Jordar Sujatha punches to mukku avinash

కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ లో జబర్దస్త్ కమెడియన్లతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా పార్టిసిపేట్ చేస్తుండటంతో దానికి పాపులారిటీ పెరుగుతోంది. జోర్దార్ సుజాత, అషురెడ్డి, సీరియన్ నటి సిరి.. వీళ్లంతా స్కిట్లలో నటించి ఈ ప్రోగ్రామ్ కు మరింత అందాన్ని తీసుకొస్తున్నారు.

అలాగే.. యాంకర్ వర్షిణీ తన అందాల్లో కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. జడ్జిలు శేఖర్ మాస్టర్, హీరోయిన్ శ్రీదేవి.. ఇద్దరూ కలిసి చేసే హంగామా కూడా మామూలుగా ఉండటం లేదు.

Comedy Stars : స్కిట్ లో అవినాష్ ను ఓ ఆట ఆడుకున్న సుజాత

అయితే.. స్కిట్ లో భాగంగా జోర్దార్ సుజాత్.. ముక్కు అవినాష్ ను ఓ ఆట ఆడుకుంది. తన స్కిట్ లో అవినాష్ ముగ్గురు అందమైన అమ్మాయిలను పెట్టుకున్నాడు. జోర్దార్ సుజాత, అషురెడ్డి, సిరి.. ఈ ముగ్గురితో కలిసి స్టేజ్ మీద మామూలుగా చేయలేదు రొమాన్స్.

సుజాత.. అవినాష దగ్గరికి వచ్చి.. చేయి మీద గోకుతుంటే.. గోకింది చాలు.. పక్కకు వెళ్లు అంటాడు. దీంతో చెంప మీద ఒకటి వేసి.. ఇంట్లో ఏం చేయడు కానీ.. అన్నీ స్టేజ్ మీదికి వచ్చినప్పుడే.. అని సుజాత అనేసరికి.. ఇంట్లో ఏం చేయడా? అంటూ శేఖర్ మాస్టర్ పంచ్ వేస్తాడు.

మొత్తానికి కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ జబర్దస్త్ కు దీటుగా దూసుకెళ్తోంది. దానికి సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసేయండి.

 


Share

Related posts

మార్చి 23న ఐపిఎల్

Siva Prasad

Varun Tej: `గ‌ని` కొత్త రిలీజ్ డేట్ వ‌చ్చేసింది.. ఈసారైనా మోక్షం క‌లిగేనా?

kavya N

Pushpa: బన్నీ క్రేజ్ మాములుగా లేదు ఏకంగా విగ్రహం..ఎక్కడో తెలిస్తే నోరెళ్లబెడతారు!!

sekhar