NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Adimulapu Suresh : మంత్రివర్యా..! కరోనాపై విద్యారంగంతో పోరాడతారా..?

Adimulapu Suresh : ఆదిమూలపు సురేశ్ Adimulapu Suresh దేశంతోపాటు రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి మరీ ఘోరంగా ఉందనే విషయం తెలిసిందే. రాష్ట్రాల్లో రోజుకి వందల్లోని కేసులు వేలల్లో.. దేశంలో వేలల్లోని కేసేలు లక్ష, రెండు లక్షలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో వ్యాక్సిన్ లేనప్పుడు ఉన్న భయం కంటే.. వ్యాక్సిన్లు వచ్చాక పరిస్థితులు మరింత భయంకరంగా మారిపోవడం అర్ధం కానిది. ఇటువంటి పరిస్థితుల్లో అనేక వ్యవస్థలతోపాటు విద్యారంగం కూడా ఎఫెక్ట్ అయింది. దీంతో సీబీఎస్ఈ పది పరిక్షల రద్దు, ఇంటర్ పరిక్షలను వాయిదా వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలు కూడా అదే బాట పట్టాయి. కానీ.. ఆంధ్రప్రదేశ్ ఇందుకు విరుద్ధంగా వెళ్తోంది.

comments on ap educational minister decision Adimulapu Suresh
comments on ap educational minister decision dimulapu Suresh

దేశమంతా ఒక దారైతే.. ఏపీది మరో దారిలా ఉంది. తెలంగాణ ప్రభుత్వం గతంలోనే స్కూళ్లు మూసేసింది. బార్లు, షాపింగ్ కాంప్లెక్స్ లకు లేని కరోనా స్కూళ్లకేనా అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. తెలంగాణ నిర్ణయమే కరెక్ట్ అనే దిశగా పరిస్థితులు మారిపోయాయి. దేశంలో కరోనా విజృంభణ పెరిగిపోయింది. దీంతో వెంటనే కేంద్రం సిబీఎస్ఈ పరిక్షలు రద్దు చేసి, ఇంటర్ పరిక్షలు వాయిదా వేసింది.

ఐసీఎస్ఈ కూడా ఇదే బాట పట్టింది. ఢిల్లీ, పంజాబ్, తెలంగాణ కూడా పదో తరగతి పరిక్షలు రద్దు చేసేశాయి. కానీ.. ఏపీ మాత్రం చోద్యం చూస్తోంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. షెడ్యూల్ ప్రకారమే పరిక్షలు జరుపుతామని ప్రకటించింది. రోజురోజుకీ ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అనేక విద్యాసంస్థల్లో విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు కరోనా సోకడమూ జరిగింది.

అయినా.. ఏపీ విద్యాశాఖ కరోనాతో పోరాడుతున్నట్టు మంత్రి సరేశ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామనే ప్రకటించారు. ప్రస్తుతం జెట్ స్పీడ్ లో ఉన్న కరోనా తీవ్రత మరో పది, పదిహేను రోజుల్లో తగ్గిపోతుందనే గ్యారంటీ లేదు. మరి.. ఏపీ ఇంకా స్కూళ్లు, కాలేజీల నిర్వహణ, పరిక్షల రద్దు విషయంలో ఎందుకు తాత్సారం చేస్తుందో పాలకులకే ఎరుక. విద్యార్ధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఇది ఇబ్బందిపెట్టడమే. రేపు జరగబోయే సీఎం సమీక్షలో ఏం నిర్ణయం తీసకుంటుందోననే ఆసక్తి ప్రస్తుతానికి నెలకొంది. ఏదేమైనా.. అందరూ ప్రకటించాకే ఏపీ నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయనే చెప్పాలి.

author avatar
Muraliak

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju