NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కే‌సి‌ఆర్ ప్రవర్తన పై తీవ్ర విమర్శలు..

తెలంగాణ రాష్ట్రంలో  కరోనా కలకలం అంతా ఇంతా కాదు .ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తున్న  రోగానికి సంబంధించిన నిర్దారణ పరీక్షల మీద కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహం ఏ మాత్రం మింగుడుపడని రీతిలో ఉందని చెబుతునారు.

దేశంలోని చాలా రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో నిర్దారణ పరీక్షలు చాలా తక్కువగా జరుపుతున్న సంగతి తెలిసిందే.రోజు రోజుకి పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ప్రభుత్వం చేయించకపోయినా తమంతట తామే నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు సిద్ధపడుతున్నప్పటికీ ఆ తరహా అనుమతి కూడా లభించడం లేదు
మాకు కరోనా పరీక్షలు చేయమని వెళ్లిన వాళ్లకు పరీక్షలు చేయాల్సిన వారు.. కొన్ని ప్రశ్నలు అడిగి.. మీకు పరీక్ష అవసరం లేదని తేల్చేయటం ఇప్పుడో తల నొప్పిగా మారుతోంది.కరోనా పాజిటివ్ రోగులకు దగ్గరగా మెలిగిన వారికి సైతం నిర్ధారణ పరీక్షలు చేయడానికి కెసిఆర్ ప్రభుత్వం నిరాకరిస్తున్నట్లు సమాచారం.రెండు రోజుల క్రితం ఒక వ్యక్తికి పాజిటివ్ అని తేలితే.. అతను పని చేసే చోట అతనికి చెరో పక్క కూర్చున్న ఇద్దరికి మినహా నిర్దారణ పరీక్షలు చేయని వైనం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఆ ఆఫీసులో.. సదరు పాజిటివ్ వచ్చిన వ్యక్తికి దగ్గరగా మెలిగిన వారందరూ తమకు నిర్దారణ పరీక్షలు చేయాలని కోరుతున్నా అధికారులు అక్కర్లేదంటున్నారు. సర్లే.. ప్రైవేటుగా చేయించుకుందామంటే.. ప్రభుత్వ అనుమతి ఇచ్చింది లేదు.ఈ లాజిక్ ఏమిటో అర్థం కావట్లేదని ప్రభుత్వ అధికారులు సైతం ప్రైవేటు సంభాషణల్లో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. దేశంలో పెరిగి పోతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో ఐసీఎంఆర్ కొన్ని షరతులతో ప్రైవేటు ల్యాబ్ లలో పరీక్షలు జరిపేందుకు.. ప్రైవేటు ఆసుపత్రుల్లోచికిత్సకు అనుమతించింది. ఢిల్లీతో సహా కొన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నా.. తెలంగాణలో మాత్రం అలాంటివేమీ లేకపోవటం విశేషం.అసలు కరోనా విషయంలో కెసిఆర్ ఆలోచనా ఆలోచనా ధోరణి ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు 








author avatar
Yandamuri

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju