కొత్తగా వాహనం కొనుగోలు చేయాలనుకునే వారి మొదటి ఎంపికలో పల్సర్ బ్రాండ్ ఒకటి.. ఇది మార్కెట్లో అడుగుపెట్టి దశాబ్దం కావస్తున్నా దీని క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు.. పల్సర్ బైక్ వాహన ప్రియుల ఉత్తమ ఎంపికగా మారిందనడంలో సందేహం లేదు.. ఎందుకంటే ఈ సంవత్సరం అన్ని పల్సర్ మోడల్స్ విక్రయాలు మంచి వృద్ధిరేటును సాధించి రికార్డు సృష్టించాయి..!
బజాజ్ పల్సర్ బ్రాండ్ ను మొదటిసారిగా 2001లో 150సిసి ఇంజిన్ తో ప్రస్తుతం పల్సర్ బ్రాండ్ లో 150సీసీ నుండి 220సీసీ వరకు వివిధ మోడల్స్ ను వినియోగదారులకు పరిచయం చేసింది. భారతదేశంలో ఈ మోడల్ అమ్మకాల జోరుతో పాటు ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. నవంబర్ 2020 నెలలో పల్సర్ దేశీయ విక్రయాలు 53.66% వృద్ధి చెందగా , ఎగుమతులు 28.64% వృద్ధి సాధించాయి. నవంబర్ 2020 నెలలో పల్సర్125 సిసి వేరియంట్ అమ్మకాలు గణనీయంగా 56,549 యూనిట్లను విక్రయించగా, 2019 నవంబర్ నెలలో 50,193 యూనిట్లను మాత్రమే అమ్ముడయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ వేరియంట్ గరిష్టంగా 180% వృద్ధిరేటును సాధించి బెస్ట్ సెల్లింగ్ మోడల్ గా నిలిచింది.
బజాజ్ పల్సర్ 220ఎఫ్ 7114 యూనిట్ల విక్రయాలై,26% వృద్ధి రేటు ను సొంతం చేసుకుంది. ఇంకా పల్సర్ 160, పల్సర్ 180, పల్సర్ 200 వేరియంట్స్ విక్రయాల మొత్తం 10,522 యూనిట్లుగా నమోదై 24% వృద్ధిని సాధించాయి. 2020 నవంబర్ లో మార్కెట్ అన్నిరకాల ఇంజన్ ఆప్షన్లతో కూడిన పల్సర్ బ్రాండ్ అమ్మకాలు 1,04,904 అమ్ముడవ్వగా గత ఏడాది నవంబర్ 2019లో68,268 యూనిట్లను మాత్రమే విక్రయించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 53.66% వృద్ధిరేటును సాధించి పల్సర్ రికార్డు సృష్టించింది.