Bank: చాలా సార్లు చాలా వ్యవస్థల్లో ఉన్న అధికారులు మన సమస్యలు తీర్చడం లో నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆ వ్యవస్థలో ఎంతకీ మన సమస్య పరిష్కారం కాదు. అలాగే బ్యాంకు లో కూడా ఏదైనా సమస్య వస్తే ఎవరికి కంప్లైంట్ ఇచ్చి సమస్య పరిష్కరించుకోవాలి.. అనేది తెలుసుకుందాం బ్యాంకుల పనితీరు ఖాతాదారులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు పరిష్కరించడం కోసం 1995లోరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబుడ్స్‌మెన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అయితే ఈ అంబుడ్స్‌మెన్‌ను సంప్రదించేముందు మీరు విధిగా సమస్యను బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్ళాలి. అక్కడ సమస్యకు పరిష్కారం దొరకకపోతే మాత్రమే అప్పుడు అంబుడ్స్‌మెన్‌ను సంప్రదించవలిసి ఉంటుంది .
ఏ ఏ సమస్యలలో అంబుడ్స్‌మెన్‌ను సంప్రదించాలలి అనేది తెలుసుకుందాం. బ్యాంకు అందించే అన్ని రకాల సేవలు అంటే చెల్లింపుల్లో జాప్యం, చిన్న నోట్లను అనుమతించకపోవటం, చెక్ బుక్కులు ఇవ్వకపోవటం, డి.డి చెల్లక పోవడం,బ్యాంకర్ల చెక్కులు, ఏ టి.ఎం, క్రెడిట్ కార్డు ల్లో తలెత్తిన సమస్య ఇలా వేటిపై నైనా సమస్య పరిష్కారం దొరకపోయినట్టయితే అప్పుడు అంబుడ్స్‌మెన్ సంప్రదించవచ్చు.
ఫిర్యాదు చేసే విధానం తెలుసుకుందాం
నేరుగా అంబుడ్స్‌మెన్ కార్యాలయాన్ని సంప్రదించడం ద్వారా కాని లేదా పోస్ట్, ఆన్లైన్ ద్వారా కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు.
అంబుడ్స్‌మెన్ కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలనుకున్నవారు
www.rbi.org.in/scripts/bs_
Reserve Bank of India
6-1-56, Secretariate Road
Saifabad, Hyderabad – 500 004
Tel. Nos: 040-23210013 / 040-23243970.
Fax: 040-23210014