NewsOrbit
న్యూస్

ఒప్పేసుకోవయ్యా కేటీఆర్ ! జగన్ నీకు అన్న లాంటోడు

ఆంధ్రప్రదేశ్లో దిగ్విజయంగా అమలవుతున్న ఒక వ్యవస్థను తెలంగాణలో కూడా ప్రవేశపెట్టబోతున్నారని సమాచారం.కాకుంటే పేర్లే తేడా! వివరాల్లోకి వెళితే ఏపీలో విజయవంతమైన వాలంటీర్ల వ్యవస్థను తెలంగాణలోనూ అమలు చేసే యోచనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళుతోంది.

agree ktr ys jagan is like your brother
agree ktr ys jagan is like your brother

కొద్దిపాటి మార్పులతో అలాంటి వ్యవస్థలనే తెలంగాణలోని పట్టణాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి ఈ వ్యవస్థను తెలంగాణలోని పట్టణాల్లో ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి కెటిఆర్ ప్రకటించేశారు కూడా .ప్రతి పట్టణంలో వార్డుకు ఓ అధికారిని నియమించనున్నట్టు ఆయన తెలిపారు.పారిశుద్ధ్యం, హరితహారం సహా ఇతర కార్యక్రమాలు సమర్థంగా అమలు చేయడం కోసం వారిని నియమించనున్నట్టు తెలిపారు. ఇలా వార్డుకో అధికారిని నియమించడం దేశంలోనే తొలిసారి అని పేర్కొన్నారు. ఈ ఒక్క కెసిఆర్ స్టేట్మెంటే ఆంధ్రప్రదేశ్లోని వైసిపి వారికి నచ్చడం లేదు.ఎందుకంటే ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో అమలవుతోంది ఇక్కడ రెండు రకాలు అనగా గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లుగా వారి సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది.

ఏపీలో వాలంటీర్లను నియమించడం ద్వారా ప్రభుత్వ పథకాల అమలును వారి చేత జరిపించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ ను నియమించి, వారికి సంబంధించిన అన్ని వివరాలూ ప్రభుత్వం సేకరించింది. పథకాల అమల్లోనే కాకుండా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలోనూ వారి సేవలను సర్కారు వినియోగించుకుంది. దేశంలోని ఒకటి రెండు రాష్ట్రాలు సైతం ఈ వ్యవస్థపై మక్కువ చూపించాయి.తాజాగా ఆ బాటలోకి తెలంగాణ వచ్చింది. అయితే, నేరుగా అలాంటి వ్యవస్థే కాకుండా కొన్ని మార్పులు చేసి వార్డు ఆఫీసర్ల నియామకానికి శ్రీకారం చుట్టింది. వార్డుకో అధికారిని నియమించడం ద్వారా ఆ వార్డులోని సమస్త సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంది.

ప్రభుత్వ పథకాలు అందించడంలోనూ, లోటుపాట్లను తెలుసుకోవడంలోనూ వీరు అక్కరకొస్తారు. ఇక పార్టీపరంగా కూడా వీరిని అనధికారికంగా వినియోగించుకునే అవకాశం ఉంది.తెలంగాణ ప్రభుత్వం దీని పేరు మార్చి పట్టణాల్లో వార్డు అధికారులుగా ఈ వ్యవస్థనే ప్రవేశపెట్టబోతోంది.ఇంకా దాపరికం ఏమిటి కేటీఆర్ ?మంచి పథకం కాబట్టి మేమూ ఆచరిస్తున్నాం అని ఒప్పుకోవచ్చు కదా అని వైసీపీ వర్గాలు అడుగుతున్నాయి . ఏదేమైనా సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా కాపీలు, అనుసరణలు, ఇన్స్పిరేషన్లు ఉంటాయన్నమాట!

author avatar
Yandamuri

Related posts

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N