ప్రొడ్యూసర్ల షరతులకు మల్టీప్లెక్స్ ఓనర్లు సై అంటారా?

మార్చి 15వ తేదీన కరోనా నేపథ్యంలో మూత పడిన మల్టిప్లెక్సు లు మరియు థియేటర్లు సుమారు ఎనిమిది నెలల తర్వాత తిరిగి ఇప్పుడు తెరుచుకున్నాయి. కేంద్ర హోం శాఖ సూచించినట్లుగా కేవలం 50 శాతం సీట్లకు మాత్రమే టిక్కెట్లను రిలీజ్ చేస్తున్నారు. రెండు గంటల ముందు మాత్రమే ఆన్లైన్ లో టికెట్స్ ను అందుబాటులో ఉంచుతున్నారు. ఇంతకముందు లాగా రోజుకు 8 షోలను కాకుండా కేవలం 3 షోలను మాత్రమే ప్రదర్శించనున్నారు. క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్ తో ప్రస్తుతం మల్టీప్లెక్సులు నడుస్తున్నాయి.

ప్రొడ్యూసర్ల షరతులకు మల్టీప్లెక్స్ ఓనర్లు సై అంటారా?ఓటీటీ లకు సినిమాలని ఇవ్వవద్దని థియేటర్లు మరియు మల్టీప్లెక్స్ ఓనర్లు ప్రొడ్యూసర్లను విన్నవించుకున్నట్లు ఇప్పుడు ప్రొడ్యూసర్లు కూడా కొన్ని షరతులతో ముందుకువచ్చారు. షరతులలో ముందుగా వీ పీ ఫ్ చార్జీలు ఉండకూడదని, మైంటెనెస్ ఖర్చులకు ప్రొడ్యూసరుకు సంబంధం ఉండకూడదని మరియు రివెన్యూ షేరింగ్ లో మొదటి వారం 60:40, రెండవ వారం 50:50, మూడవ వారం 40:60 గా ఉండాలని నిర్ణయించారు. మరి ఈ షరతులకు మల్టీప్లెక్స్ ఓనర్స్ ఎం జవాబు ఇస్తారో వేచి చుడాలిసిందే.