Bheemla Nayak: 2022 సంక్రాంతికి విడుదల కావాల్సిన చాలా పెద్ద సినిమాలు ఆగిపోయాయి.2020-21 ఈ రెండు సంవత్సరాలు సినిమాలను ఎంత గందరగోళం చేశాయో తెలిసిన విషయమే. ఆ క్లిష్ట పరిస్థితులు ఇప్పటికీ ఇంకా తొలగిపోలేదు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఒకరి కోసం ఇంకొకరు త్యాగం చేసినా ఫలితం కానరాలేదు. వీరి సినిమాలు ఇప్పటికీ విడుదలకు నోచుకోని పరిస్థితి కనిపించే అవకాశం లేదనిపిస్తుంది.
పాన్ ఇండియా చిత్రం ఆర్ ఆర్ ఆర్ కూడా విడుదల వాయిదా తో రిలీజ్ చేసే వేరే చిత్రాలు కూడా ఇరుకున పడ్డాయి. భీమ్లా నాయక్ నీ జనవరి 12 న రిలీజ్ అనుకున్నారు, కానీ అప్పుడు వీలు కాలేదు. తర్వాత డేట్ ఫిబ్రవరి 25 అని ఫిలిం మేకర్స్ చెప్తున్నారు. అప్పుడు కూడా విడుదల అవుతుందో లేదో అన్న సందేహం కలుగుతుంది.
శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం కూడా భీమ్లానాయక్ కు ఇచ్చిన డేటు వీళ్లు కూడా ఇచ్చారు. ఒక అగ్ర హీరో చిత్రం విడుదల రోజు శర్వానంద్ తన చిత్రం విడుదల చెయ్యడు. మరి రిలీజ్ డేట్ ఇచ్చారంటే పవన్ సినిమా ఆ రోజు విడుదల కాదు అని అనుకోవాల్సి వస్తుంది. భీమ్లా నాయక్ వేరే తేదీ కోసం చూస్తున్నారని సందేహం వస్తుంది. సితార ఎంటర్టెయిన్మెంట్స్ వాళ్లు ఈ విషయంపై వివరణ ఇస్తారేమో చూడాలి. భీమ్లా నాయక్ సినిమా ముగింపుకు వచ్చింది. ఇంకా కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి కావాల్సి ఉంది.దీంతో సినీ వర్గాలు భిమ్లనాయక్ రిలీజ్ ను లైట్ తీసుకున్నారా అంటున్నారు.