పీవీ సింధుకు అభినందన

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

హైదరాబాద్, డిసెంబర్ 24 : హైదరాబాద్‌లో సోమవారం భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి  పీవీ సింధును అభినందించారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ విజేతగా నిలిచినందుకు పీవీ సింధుకు ఆయన అభినందనలు తెలియజేశారు.  భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.  భారతదేశ ఖ్యాతిని పెంచేందుకు ప్రతి ఒక్క క్రీడాకారుడు  కృషి చేయాలని ఈ  సందర్భంగా  ఆయన  పిలుపునిచ్చారు.