తెలంగాణ కాంగ్రెస్ లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారంగా హాట్ హాట్ గా నడుస్తొంది. బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికీ తన నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలు, అభిమానులతో పలు మార్లు సమావేశాలు నిర్వహించారు. తన మనసులో మాటను వెల్లడించారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడకుండా ఉండేందుకు పలువురు కీలక నేతలు బుజ్జ గింపుల పర్వం కొనసాగించారు. అయినప్పటికీ రాజగోపాల్ రెడ్డి మెత్తబడలేదని తెలుస్తొంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి వ్యవహారంతో పాటు పార్టీలోచేరిక అంశంపై తెలంగాణ ముఖ్య నేతలతో చర్చించేందుకు హైకమాండ్ సిద్దమైంది. పార్టీ ముఖ్య నేతలను ఢిల్లీకి ఆహ్వానించినట్లు తెలుస్తొంది. ఈ రోజు (సోమవారం) సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో జరగనున్న సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ కు సమంబంధించి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉండగా, పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డికి ఢిల్లీకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. అయితే ఢిల్లీకి వెళ్లేందుకు ఆయన ఆసక్తి చూపనట్లు తెలుస్తొంది. ఇక్కడి పరిణామాలపై చర్చించేందుకు అవసరమైతే ఫోన్ లో అందుబాటులో ఉంటానని జానారెడ్డి పార్టీ పెద్దలకు చెప్పినట్లు తెలిసింది. ఈ సమావేశంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో పార్టీ హైకమండ్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రస్తుత పరిస్థితిలో రాజగోపాల్ రెడ్డి ని పార్టీ వదులుకోవడానికి సిద్ధం లేదు. ఆయన విషయంలో పార్టీ సీనియర్ నేతలు అనుసరిస్తున్న వైఖరే అందుకు నిదర్శనంగా కనబడుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానంలో వేరే ఇంకెవరైనా నాయకుడు అయితే ఈ పాటికే షోకాజ్ నోటీసు జారీ చేసి క్రమశిక్షణా చర్యలు తీసుకునే వారని అంటున్నారు. నియోజకవర్గంలో సొంత క్యాడర్ ఉండి బలమైన నేతగా ఉన్నందున రాజగోపాల్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచిచూసి అడుగులు వేస్తొంది. రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపిగా, సీనియర్ నేతగా ఉన్నారు.ఈ తరుణంలో పార్టీ హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
నాగార్జున వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస ఫ్లాపులను మూడగట్టుకున్నాడు. ఈయన నుండి వచ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వరలోనే `కార్తికేయ 2`తో పలకరించబోతున్నాడు.…
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…