NewsOrbit
న్యూస్

Congress: ఎన్డీయే సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సోనియా, ఖర్గే, రాహుల్ .. ఎన్నికల వేళ పోస్టర్లు ప్రింట్ చేయలేకపోతున్నాం .. ప్రచారం చేయలేకపోతున్నామంటూ ఆవేదన

Congress: కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్ చేయడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో పాటు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీజేపీ అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తొందని విమర్శించారు. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్, ఎన్నికల బాండ్ల అంశాలపై గురువారం వీరు ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమ పార్టీని దెబ్బతీసేందుకు ప్రధాని మోడీ తీవ్ర చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలక వేళ డబ్బులు లేకపోవడంతో ప్రచారం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తమ పార్టీకే కాదని మొత్తం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని అన్నారు. ప్రజలు పార్టీ కోసం ఇచ్చిన విరాళాలను వాడుకోకుండా చేయడం అప్రజాస్వామికమన్నారు.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిందని ఆరోపించారు. అధికార పార్టీ వైఖరి ఎంతో ప్రమాదకరమన్నారు. బీజేపీ వేల కోట్ల రూపాయలు విరాళాలుగా తీసుకుని ..కేవలం మా బ బ్యాంకు ఖాతాలను ఎందుకు స్తంభింపజేసిందని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విలువలు, అదర్శాలకు భారత్ పేరు గాంచిందని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన విషయం ప్రజలకు తెలిసిందని అన్నారు.

ప్రజాస్వామ్య దేశంలో నిష్పక్షపాతమైన ఎన్నికలు తప్పనిసరన్నారు. ప్రతి ఒక్కరికీ సమానమైన అవకాశులు ఉండాలని ఖర్గే పేర్కొన్నారు. మోడీ పాలనలో భారతదేశ ప్రతిష్ట దిగజారుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖాతాలను ఫ్రీజ్ చేయడం ద్వారా ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఓ రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డంకులు సృష్టించడం సరికాదని ఖర్గే అభిప్రాయపడ్డారు. ఎక్కడ చూసినా బీజేపీ ప్రకటనలే కనిపిస్తున్నాయన్నారు. తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.

సోనియా గాంధీ మాట్లాడుతూ ..కాంగ్రెస్ ను ఆర్ధికంగా దెబ్బతీసేందుకు ప్రధాని మోడీ వ్యవస్థీకృతంగా ఇలాంటి చర్యలకు పాల్పడున్నారని ఆరోపించారు. ఓ వైపు ఎన్నికల బాండ్ల వ్యవహారం.. మరో వైపు దేశంలోని ప్రధాన ప్రతిపక్షం ఆర్ధిక లావాదేవీలపై దాడి జరుగుతోందన్నారు. ఇన్ని సవాళ్ల మధ్య ఎన్నికల్లో మేం సమర్ధంగా ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ .. దేశంలో ప్రజాస్వామ్యమే లేదన్నారు. బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేస్తే ఎన్నికల్లో ఎలా పోటీ చేయగలమన్నారు. ఎవరైనా బ్యాంకు అకౌంట్ మూసివేసినా, ఏటీఎం కార్డు పని చేయకుండా చేస్తే జీవించగలరా .. ప్రస్తుతం తాము ఎన్నికల్లో ప్రచారం చేసే పరిస్థితి లేకుండా బీజేపీ కుట్రకు పాల్పడిందని అన్నారు. ఎన్నికల వేళ ప్రచారం కోసం ప్రకటనలు ఇవ్వలేకపోతున్నామనీ, మా నేతలను ఎక్కడికీ పంపించలేకపోతున్నామన్నారు. విమాన ప్రయాణాలు పక్కన పెట్టండి.. కనీసం రైలు టికెట్లు కొనడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని రాహుల్ గాంధీ అన్నారు.  ఎన్నికలకు రెండు నెలల ముందు ఇలా చేయడం వల్ల కాంగ్రెస్ ను ఎన్నికల్లో పోటీ చేయనివ్వకూడదనేదే బీజేపీ ఉద్దేశంగా కనిపిస్తొందని రాహుల్ ఆరోపించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తాము ప్రచారం చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టర్లు వేయించడానికి వీలులేని పరిస్థితులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కల్పిస్తొందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ప్రజలు తమకు మద్దతు ఇవ్వాలని అజయ్ మాకెన్ కోరారు. బీజేపీతో సహా ఏ రాజకీయ పార్టీ ఆదాయపన్ను చెల్లించనప్పటికీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 బ్యాంకు ఖాతాలను ఎందుకు ఫ్రీజ్ చేశారని ఆయన ప్రశ్నించారు.

Supreme Court: తమిళనాడు గవర్నర్ రవి తీరును తప్పుబట్టిన సుప్రీం కోర్టు ..

author avatar
sharma somaraju Content Editor

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju