పీఎం పర్యటనలో ప్రోటోకాల్ ఉల్లంఘన..! ఎంపీ రేవంత్ పిర్యాదు..!!

 

ప్రధాని నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్ పర్యటనకు విచ్చేస్తున్న విషయం తెలిసిందే. భారత్ బయోటెక్ సంస్థ ను సందర్శించి కరోనా టీకా అభివృద్ధి,ఉత్పత్తి, పంపిణీ తదితర అంశాలపై అయన సమీక్షించనున్నారు. అయితే హకీంపేట విమానాశ్రయం వద్ద ప్రధాన మంత్రికి స్వాగతం పలికేందుకు ఐదుగురు అధికారులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. పీ ఎం మోడీ పర్యటన పై  మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు, రేవంత్ రెడ్డి కి అధికారులు ఆహ్వానం పంపలేదు.

దీనిపై కాంగ్రెస్ నేత, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి ఆక్షేపణ వ్యక్తం చేశారు. హకీంపేట, భారత్ బయోటెక్ సంస్థ తన నియోజకవర్గ పరిధిలో ఉన్నప్పటికీ తనకు ఆహ్వానం లేకపోవడాన్ని తప్పు పట్టారు. దీనిపై రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. లోక్ సభ స్పీకర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి లకు పిర్యాదు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో గ్రెటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ కూడా హాకింపేట వద్ద ఆహ్వానం పలికేందుకు అనుమతులు ఇవ్వలేదు పీఎంఒ.