NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Congress: దేశంలో కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడం ఖాయం…. సరికొత్త పొలిటికల్ స్ట్రాటజీ..!!

Congress: ఎప్పుడైతే 2014 బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ పేరు తెరపైకి వచ్చింది అప్పటినుండి కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది అని చెప్పవచ్చు. సరిగ్గా 2014 సార్వత్రిక ఎన్నికల టైంలో.. మోడీ తనదైన శైలిలో… దేశవ్యాప్తంగా దాదాపు పది సంవత్సరాల పాటు అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై వ్యతిరేకతను ఒంటి చేత్తో తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న అనేక రాజకీయ శక్తులను ఏకం చేసి… తిరుగులేని విజయాన్ని ఆ సమయంలో సాధించారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్షతన ఉన్న యూపీఏ ప్రభుత్వం కుప్పకూలి పోయింది. ఎంతలా అంటే కేవలం రెండు అంకెలకు పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలు ఉండటం అప్పట్లో సంచలనం సృష్టించింది. మిత్రపక్షాలు లేకుండానే బిజెపి పార్టీని మోడీ అధికారంలోకి కూర్చోబెట్టారు. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికలలో కూడా అదే రీతిలో బీజేపీ గెలవడం జరిగింది. దీంతో ఇప్పుడప్పుడే కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలిచే ఛాన్స్ లేదని చాలా వరకు.. ఆ పార్టీలో ఉన్న నాయకులే బహిరంగంగా కామెంట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అనుకున్న రాహుల్ గాంధీ.. సారధ్యంలో పార్టీ 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంతో… కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులే.. ఇక కాంగ్రెస్ లో ఉంటే.. భవిష్యత్తు ఉండదు అన్న ఆలోచనల్లోకి అప్పట్లో రావడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పోరాడటానికి అనేక రాజకీయ పార్టీలు ముందుకు వస్తున్న క్రమంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకోవడానికి సరికొత్త స్ట్రాటజీ ఉపయోగించటానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

Congress should utilise young leaders - The Sunday Guardian Live

ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాలలో.. బిజెపి పార్టీకి వ్యతిరేకంగా అనేక పార్టీలు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి.. ముందుకు రావటంతో ఇటీవల తనతో పాటు కలిసి పార్లమెంటులో పోరాడిన పార్టీలను ఏకతాటిపైకి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీసుకురావడం తెలిసిందే. ఈ క్రమంలో పార్లమెంటులో మాత్రమే కాక బయట కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికలనీ దృష్టిలో పెట్టుకుని అందరూ కలిసికట్టుగా రాజకీయంగా బీజేపీ పై పోరాటం చేయాలని.. ఇటీవల వర్చువల్ సమావేశంలో సోనియా గాంధీ పిలుపునివ్వడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా దక్షిణాది పై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే కాంగ్రెస్ పార్టీ లో దక్షిణాది నేతలకు పెద్దపీట వేయాలని మొదటి నుండి.. ఆ రీతిగానే వ్యవహరిస్తూ ఉంది. ఉత్తర భారతదేశం లో ఎక్కువగా బిజెపి ప్రాబల్యం ఉండటంతో కాంగ్రెస్ దక్షిణాది పై పట్టు కోల్పోకుండా ఎక్కడికక్కడ రాజకీయ వ్యూహాలతో దూసుకుపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యసభలో పార్టీ విప్ గా కర్ణాటకకు చెందిన నజీర్ హుస్సేన్ నీ నియమించడం.. అదే రాష్ట్రానికి చెందిన మల్లికార్జున కార్ గేమ్ మరియు జయరాం రమేష్ నేతగా వ్యవహరించటం తెలిసిందే.

దక్షిణాది పై స్పెషల్ ఫోకస్….

ఇక పార్లమెంట్ విషయానికి వస్తే పార్టీ నేతగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన అధిర్ రంజన్ చౌదరి, ఓపెన్ యాత్రకు హాసన్ నాయకుడు గౌరవ్ గోగోయి..చీఫ్ విప్ గా కేరళ రాష్ట్రానికి చెందిన సురేష్, తమిళనాడు రాష్ట్రానికి చెందిన మణికం ఠాగూరు నీ నియమించడం జరిగింది. అదే రీతిలో పార్టీలో కీలకమైన సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా చేసి వేణుగోపాల్ ప్రధాన సలహాదారుగా పీ చిదంబరం తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు కావడంతో దాదాపు కాంగ్రెస్ పార్టీ… దక్షిణాదిని పునాదిగా చేసుకుని పార్టీ పదవులను వారికే కట్టబెట్టి… మళ్లీ కాంగ్రెస్ పార్టీ గత పునర్ వైభవాన్ని రాబోయే రోజుల్లో చాటే రీతిలో .. ఆ పార్టీ హైకమాండ్ భావిస్తోంది. మరోపక్క ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలావరకు బీజేపీకి వ్యతిరేక పవనాలు వస్తూ ఉన్న నేపథ్యంలో… రైతు చట్టాలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుదల.. కరోనా వంటి విషయాలపై.. కేంద్రంపై వ్యతిరేకత ఉన్న క్రమంలో ఇదే సరైన సమయం అని బిజెపికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను ఏకం చేస్తూ… ఉత్తరాదిలో గ్రిప్ పెంచుకుంటూనే మరోపక్క దక్షిణాదిలో ఉన్న నాయకులకు పెద్దపీట వేస్తూ.. కాంగ్రెస్ పార్టీ సరికొత్త స్ట్రాటజీ తో.. కింద నుండి పైకి రావటానికి అధికారంలో కూర్చోవడానికి.. రెడీ అవుతుంది. దీంతో రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల లో బీజేపీ ని ఎలాగైనా ఓడించడానికి సోనియా ఇప్పటినుండే అండర్ గ్రౌండ్ వర్క్… విపక్షాల తో స్టార్ట్ చేసినట్లు టాక్. ఈ ప్లాన్ వర్క్ అవుట్ అయితే గనుక దేశంలో కాంగ్రెస్ మళ్ళీ పుంజుకోవడం గ్యారెంటీ అని అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు.

Related posts

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk