Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో.. స్టార్ట్ అయిన కొత్త లవ్ స్టోరీ..అర్ధరాత్రి పిలిచి మరీ టైట్ హగ్ !!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ స్టార్ట్ అయ్యి దాదాపు పది ఎపిసోడ్లు దాటిపోయాయి. మరికొద్ది రోజుల్లో రెండో కంటెస్టెంట్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో.. ప్రస్తుతం హౌస్ లో వాతావరణం చూస్తే ఎక్కడికక్కడ గొడవలు.. గ్రూపులు క్రియేట్ అయ్యాయి. గత సీజన్లో తో పోలిస్తే ఈసారి హౌస్ లో భయంకరమైన బూతులు.. మాట్లాడటం మాత్రమే కాక చాలా సీరియస్ గా తీసుకుని భయంకరమైన పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు.

ఈక్రమంలో లవ్ ట్రాక్ కోణం మాత్రం ఇప్పటివరకు ఏ జంట మధ్య కనబడలేదు. బయట టాక్ ప్రకారం శ్రీరామ్ హమీద.. మధ్య ఇప్పుడిప్పుడే లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యింది అని అంటున్నారు. కానీ తాజాగా మాత్రం అర్ధరాత్రి.. కంటెస్టెంట్ లహరి.. మరో కంటెస్టెంట్ కి గట్టిగా హాగ్ ఇవటం ఇప్పుడు.. ప్రేక్షకులలో షోపై ఆసక్తిని రేపింది. విషయంలోకి వెళితే.. హౌస్ లో మొదటి నుండి సైలెంట్ కంటెస్టెంట్ గా కనబడిన మానస్…కి.. లహరి గట్టిగా హాగ్ ఇవ్వడం జరిగింది. పూర్తి విషయంలోకి వెళ్తే మనస్ క్లీనింగ్.. చేస్తున్న టైంలో లహరి.. బ్లాక్ డ్రెస్లో… మానస్ దగ్గరికి వెళుతుంది.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో మిడ్ నైట్ రోమన్స్.. ఆ కంటెస్టెంట్‌‌కు టైట్ హగ్ ఇచ్చిన లహరి..

ఆ సమయంలో బ్లాక్ అంటే నీకు ఇష్టమా అని లహరి నీ.. మానస్ అడుగుతాడు. అవును బ్లాక్ అంటే ఇష్టం అని చెప్పి తర్వాత బ్లూ నా ఫేవరెట్.. అంటాడు మానస్. అనంతరం ఇద్దరూ ఒంటరిగా మాట్లాడుతూ ఉన్న తరుణంలో హౌస్లో శ్రీరామ్, సిరి, ప్రియ.. వీళ్ళని గమనిస్తూ ఉంటారు. ఇదే సమయంలో లహరి, మానస కూడా వాళ్లు చూస్తున్న విషయాన్ని గమనించి వెంటనే.. మానస్ … లహరికి గుడ్ నైట్ చెప్తాడు. అయినా కానీ వీళ్ళిద్దరి దగ్గరికి శ్రీరామ్ రావటంతో ఎవరికివారు విడిపోయి వెళ్ళిపోతారు. అనంతరం లహరి.. మానస్ ని.. తన దగ్గరికి రమ్మని చెప్పడంతో ఆమె వెనకాల వెళ్లడంతో లహరి తన మైక్ తీసేసి.. వాళ్లంతా చూస్తుండగానే.. మానస్ ను గట్టిగా కౌగిలించుకుంది. ఈ సన్నివేశం చూసి హౌస్ సభ్యులంతా ఒక్కసారిగా షాక్ తింటారు. మరోపక్క బిగ్బాస్ ఆడియన్స్ కూడా.. ఇక కొత్త లవ్ ట్రాక్.. హౌస్ లో స్టార్ట్ అయిందని తాజా సన్నివేశాన్ని చూసి కామెంట్ చేస్తున్నారు.

 

సీజన్ వన్ లో.. పెద్దగా ఎవరి మధ్య లవ్ ట్రాక్.. సాగలేదు. సీజన్ టు లో కొన్ని జరిగాయి అనుకున్నా కాని చివరిలో ట్రాష్ అయ్యాయి. ఇక సీజన్ త్రీ కి వచ్చేసరికి.. రాహుల్ సిప్లిగంజ్ కి… పునర్నవి ల మధ్య లవ్ ట్రాక్ నడిచినా గాని బయట కంటిన్యూ కాలేదు. మంచి ఫ్రెండ్స్ అని.. అటువంటి ఊహించుకోవద్దు అని ఇద్దరు పలు సందర్భాలలో తెలిపారు. ఇక సీజన్ ఫోర్ లో అఖిల్..కి మోనాల్ మధ్య గట్టిగానే లవ్ట్రాక్ నడిచింది. బయట కూడా వీరిద్దరూ.. చాలా క్లోజ్ గా వస్తూ ఉన్నారు. అప్పట్లో అఖిల్..మోనాల్ కి.. సంబంధించి అనేక వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఇక ఇదిలాఉంటే సీజన్ ఫైవ్ లో.. ఇప్పటిదాకా లవ్ ఎపిసోడ్ లు.. ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని అనుకుంటున్న సమయంలో.. మానస్ కి మిడ్ నైట్ పిలిచి లహరి గట్టిగా హాగ్ ఇవ్వటం తో.. బిగ్ బాస్ ఆడియన్స్ సీజన్ ఫైవ్ న్యూ లవ్ స్టోరీ అని కామెంట్ చేస్తున్నారు. మరోపక్క శ్రీరామ్..హమీద్ ల మధ్య కూడా లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని.. జనాలు భావిస్తున్నారు. ఏదిఏమైనా ఇప్పటిదాకా హౌస్ లో అరుపులు గొడవలు.. కలిగిన వాతావరణమే ఉండటంతో తాజాగా.. కొత్త వాతావరణం క్రియేట్ చెయ్యాలా ఇంటి సభ్యులు ఒకరితో ఒకరు క్లోజ్ అవ్వటంతో… రానున్న రోజుల్లో సీజన్ ఫైవ్ చాలా రసవత్తరంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. 


Share

Related posts

Beard: గడ్డం, మీసాలు పెరగడం లేదని చింతిస్తున్నారా..!? ఇలా చేస్తే వారం రోజుల్లో మీ గడ్డం పెరగడం ఖాయం..!!

bharani jella

బిగ్ బాస్ 4: హారిక చెంప చెళ్లుమనిపించిన ఆ కంటెస్టెంట్..!!

sekhar

బోటు ప్రమాదంపై సుప్రీంలో పిటిషన్

somaraju sharma