Bigg Boss Telugu 5: ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్..??

Share

Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ సగం పూర్తి అయిపోయింది. 8 వారాలు ఆట ముగించుకుని తొమ్మిదో వారంలో అడుగుపెడుతోంది. ఈ క్రమంలో 19 మంది సభ్యులు ఎంట్రీ ఇవ్వగా ఏడుగురు ఎలిమినేట్ కావడంతో 12 మంది మిగిలారు. అయితే ఈ రోజు ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఇటువంటి తరుణం లో ప్రతి సీజన్ మాదిరిగానే..ఈ సీజన్ లో కూడా… ఎపిసోడ్ ప్రసారం కాకముందే లీక్ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లీక్ వార్తల ప్రకారం… 8వ వారం లో ఇంటి నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లోబో(Lobo) అని సమాచారం. ఈరోజు దీపావళి(Diwali) ఎపిసోడ్ కానున్న నేపథ్యంలో.. చాలామంది సెలబ్రిటీలు బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో అడుగు పెట్టనున్నారు.

Netizens troll Bigg Boss contestant Lobo

గత సీజన్లో లో ఆడిన కంటెస్టెంట్ లు బిగ్బాస్ (Bigg Boss) వేదికపై స్టెప్పులు వేస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ(Vijaydeverakonda) తోపాటు యాంకర్ సుమ(Suma) కూడా దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో కనువిందు చేయనుంది. మరికొద్ది గంటల్లో ఎపిసోడ్ ప్రారంభం కానున్న తరుణంలో హౌస్ నుండి లోబో ఎలిమినేట్ అవుతున్నట్లు తక్కువ ఓట్లు పడటంతో… ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్లు సమాచారం. లోబో… అంతకుముందు వారమే హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్లు.. సీక్రెట్ రూమ్ లోకి వెళ్లడం జరిగింది. ఆ తర్వాత నాలుగు రోజులు సీక్రెట్ రూమ్ లో నుండి..లోబో.. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ తరుణంలో హౌస్ లో ఇంటి సభ్యుల ఆట మొత్తం తెలిసిన గాని… పెద్దగా రాణించలేకపోయాడు. తనని నమ్మిన చాలా మంది పై లోబో… నెగిటివ్ టాక్ గత వీకెండ్ ఎపిసోడ్ లో…కన్ఫెక్షన్ రూమ్ లో… చెప్పిన సమయంలో..లోబో మాట్లాడిన మాటలు మొత్తం హౌస్ సభ్యులు చూడటంతో… మనోడికి దిమ్మతిరిగిపోయింది.

Bigg Boss 5 telugu contestant lobo Bio,Age,DOB,photos and more.. - Bigg Boss 5 Telugu

రానున్న రోజుల్లో

దీంతో ఆ వారం మొత్తం ప్రతి ఒక్క దగ్గరికెళ్ళి క్షమాపణలు కోరుతూ గేమ్ పై పెద్దగా కాన్సెంట్రేషన్ పెట్టకుండా చాలావరకూ డల్ అయిపోయాడు. ఇదే తరుణంలో యాంకర్ రవి కూడా గత వారం మొత్తం లొబోకి… తనపై ఇంత నెగిటివ్ ఉందని… అసలు ఊహించలేదని లోబో నీ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు లోబో పై… ఆడియన్స్ వ్యూ పరంగా మరింత మైనస్ గా మారాయి. ఇదిలా ఉంటే లోబో వెళ్ళిపోతే అసలు హౌస్ లో ఎంటర్టైన్మెంట్ పూర్తిగా పోతుంది అని.. ఈ వార్తపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. కొద్దో గొప్పో అందరిని కంట్రోల్ చేస్తూ… సెటైర్లు జోకులు వేసే కంటెస్టెంట్ లోబో(Lobo) అని… ఇటువంటి కంటెస్టెంట్ లు హౌస్ నుండి పంపించేస్తే.. రానున్న రోజుల్లో అసలు ఎంటర్ టైన్ మెంట్ హౌస్లో ఉండదని.. డిస్కషన్లు చేస్తున్నారు. బిగ్బాస్ (Bigg Boss) సీజన్ ఫైవ్ లో ఇప్పటివరకు… ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ చేసిన కంటెస్టెంట్ లోబో…అని… అతడు హౌస్ నుండి వెళ్తే షోకి మరింత నష్టం అని అంటున్నారు. ఏది ఏమైనా మాత్రం ఈ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లోబో అని లీక్ వీరుల నుండి వస్తున్న సమాచారం. హౌస్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యేదాన్ని విషయంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ(Vijaydeverakonda) చేత నాగార్జున(Nagarjuna) స్పెషల్ గేమ్ ఆడించినట్లు.. ఈ క్రమంలో షణ్ముఖ్ జస్వంత్ ముందు సేఫ్ కాగా చివరాఖరి లో లోబో.. ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. చాలా ఉత్కంఠభరితంగా 8 వ వారం ఎలిమినేషన్ ఎవరు అయ్యారు అన్న దాన్ని సరి కొత్తగా చూపించారని.. బయట టాక్. ఏది ఏమైనా దీపావళి బిగ్ బాస్ (Bigg Boss) స్పెషల్ ఎపిసోడ్ మాత్రం చాలా అదరగొట్టింది అని చెప్పుకొస్తున్నారు.


Share

Related posts

బ్రేకింగ్ : లడఖ్ కు హఠాత్తుగా వెళ్ళిన మోడీ…. చైనా ప్లాన్ షురూ…?

arun kanna

ఈఎస్ఐ స్కామ్ లో మరొక సీనియర్ టిడిపి నేత పేరు..! బయటపెట్టిన అచ్చెన్నాయుడు అరెస్ట్

arun kanna

Genelia: టాలీవుడ్‌లో మళ్ళీ జెనీలియా వస్తే అవకాశాలిస్తారా..?

GRK