NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Rahul Gandhi : రాహుల్ పై వివాదస్పద వ్యాఖ్యలతో కేరళలో రాజుకున్న వివాదం!

Rahul Gandhi : ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోరు ఇప్పుడు రాజకీయ నాయకుల మధ్య హీట్ పెంచేసింది. ఈ సమయంలో కాస్త శృతిమించిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు కాంట్రవర్శియల్ అవుతున్నాయి. లేటెస్ట్‌గా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురించి కేరళకు చెందిన మాజీ ఎంపీ అభ్యంతరకరమైన భాషను ఉపయోగించడం ఇప్పుడు ఆ రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహానికి కారణం అవుతోంది.మాజీ ఎంపీ జాయిస్ జార్జ్ చేసి ప్రకటనపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎన్నికల కమిషన్లో ఫిర్యాదు చేసింది.

Controversy erupts in Kerala over controversial remarks on Rahul!
Controversy erupts in Kerala over controversial remarks on Rahul!

జాయిస్ జార్జ్ ఏమన్నారంటే!

ఇడుక్కి జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని జాయిస్ జార్జ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ బ్యాచిలర్ అని ఆయనతో కాలేజీ యువతులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రాహుల్ కేవలం మహిళల కళాశాలలకే వెళ్తున్నారని, అక్కడికి వెళ్లి వారిని ఒంగమని చెబుతున్నారని.. దయచేసి విద్యార్థినిలు ఆలా చేయొద్దంటూ కాంట్రవర్శియల్ కామెంట్లు చేశారు. రాహుల్ గాంధీకి పెళ్లి కాలేదని.. ఆయనకు అదే పని అని జార్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఇడుక్కి జిల్లాలో ఎంఎం మణి అనే అభ్యర్థి తరపున ప్రచారం చేస్తున్న సమయంలో జార్జ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Rahul Gandhi : అంతకు ముందేమి జరిగింది?

రాహుల్ గాంధీ లేటెస్ట్‌గా కొచ్చిలో సెయింట్ థెరెసా కాలేజీకి వెళ్లారు అక్కడ విద్యార్థినిలకు ఐకిడోలో శిక్షణ ఇచ్చారు రాహుల్.. ఐకిడోలో నిపుణుడైన రాహుల్.. విద్యార్థినులు తమను తాము ఎలా రక్షించుకోవాలి అనే దానిపై ప్రాక్టికల్‌గా శిక్షణ ఇచ్చారు. ఐకిడో భంగిమల్లో కనిపించి విద్యార్థినులకి అవగాహన కల్పించారు రాహుల్ .దీనిని దృష్టిలో ఉంచుకొని జార్జ్ చెత్త వ్యాఖ్యలు చేసినట్లుగా కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది.

సీరియస్ అయిన సీఎం!

జాయిస్ చేసిన కామెంట్స్‌ను కేరళ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల తీవ్రంగా ఖండించారు. రాహుల్‌నే కాదు మహిళలను కూడా జాయిస్ కించపరిచారని మండిపడ్డారు. ఎదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని హితవుపలికారు. కేరళ ముఖ్యమంత్రి పినరియి విజయన్ కూడా జాయిస్ వ్యాఖ్యలను ఖండించారు. ఇటువంటి వ్యాఖ్యలు సరికాదని అన్నారు.

 

author avatar
Yandamuri

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju