NewsOrbit
న్యూస్

Veera Brahmendra Swamy Matam: వీర బ్రహ్మేంద్రస్వామి మఠం పీఠాధిపత్యంపై వివాదం!”పీఠ”ముడి వీడేనా? బిగుసుకునేనా??

Veera Brahmendra Swamy Matam: కాలజ్ఞాని వీర బ్రహ్మేంద్ర స్వామి మఠాధిపత్యం చిక్కుముడిగా మారింది. ఈ పర్యాయం తమకు అవకాశమివ్వాలంటూ వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి రెండో భార్య రంగంలోకి దిగడంతో “పీఠముడి ” బిగిసింది.మఠం సాంప్రదాయం ప్రకారం గత ఏడుతరాలుగా స్వామివారి పెద్దకుమారుడికి మతాధిపత్యం ఇచ్చారు.కానీ స్వామివారి వీలునామా ప్రకారం ఈసారి తన కుమారుడికి పీఠాధిపత్యం ఇవ్వాల్సి ఉంటుందంటూ ఆయన రెండో భార్య మహాలక్ష్మీ వాదన లేవనెత్తింది.ఈ నేపధ్యంలో ఎనిమిది మంది పీఠాధిపతులు వివాదం పరిష్కారానికి నడుం బిగించారు.

Controversy over the presidency of Veera Brahmendra Swamy Matam
Controversy over the presidency of Veera Brahmendra Swamy Matam

Veera Brahmendra Swamy Matam: మఠంలోనే పీఠాధిపతుల మకాం!

ఈ ఎనిమిది మంది పీఠాధిపతులు రెండురోజులపాటు వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలోని మకాంచేసి అన్ని వర్గాల వాదనలు విన్నారు.శ్రీ వీర భోగ వసంత వెంకటేశ్వరస్వామి సంతానాన్ని ఒక్కొక్కరుగా పిలిచి మాట్లాడారు.ఆయన రెండో భార్య మహాలక్ష్మితో కూడా చర్చలు జరిపారు.కందిమల్లయ్యపల్లి గ్రామస్తుల అభిప్రాయం కూడా తీసుకున్నారు.అన్ని కోణాల నుండి ఈ సమస్యను వారు అధ్యయనం చేశారు.

పీఠాధిపత్యానికి వీలునామా చెల్లదు!

పర్యటన ముగించుకొని వెళ్లే ముందు పీఠాధిపతులు మీడియాతో మాట్లాడారు.బ్రహ్మంగారి మఠం చరిత్రలో వీలునామా ప్రకారం తదుపరి పీఠాధిపతి ఎంపిక ఎక్కడా జరగలేదని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి చెప్పారు. స్వామి వారి ఆస్తుల విషయంలో వీలునామాలు చెల్లుతాయి కానీ…పీఠాధిపతి ఎంపిక విషయంలో అది చెల్లదని స్పష్టం చేశారు.బ్రహ్మాం గారి మఠం ప్రతిష్ట దిగజార్చకుండా ఉండేలా పీఠాధిపతి ఎంపికజరగాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు ఇదే విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు వివరించామని, వివాదాలకు వెళ్లవద్దని సలహా ఇచ్చామని తెలిపారు.వారసత్వమే పీఠాధిపతులుగా ఉండాలని మెజారిటీ వర్గం కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రెండు రోజుల్లో ధార్మిక పరిషత్ ,దేవాదాయ శాఖలకు తమ నివేదిక అందజేస్తామని ఆయన చెప్పారు.అతి త్వరలోనే పీఠాధిపతి ఎంపిక పూర్తి చేసి రంగరంగ వైభవంగా పీఠాధిపత్యాన్ని ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు.

Read More: Ramdev Baba Vs IMA: యోగా గురు ను మరో వైపు నుండి నరుక్కొచ్చిన ఐఎంఏ!రామ్ దేవ్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు!!

ఇంత సులువుగా పీటముడి వీడేనా?

మఠాధిపతుల మాటలను బట్టి చూస్తే పీఠాధిపత్యాన్ని రెండో భార్య తరపు వారికి ఇచ్చే సూచనలు గోచరించడం లేదు.స్వామివారి మొదటి భార్య పెద్ద కొడుక్కేఈ పీఠాధిపత్యం దక్కేలా ఉంది.ఇదే జరిగితే రెండో భార్య మౌనంగా వుంటుందా? ఆమె కోర్టుకు వెళ్లకుండా వుంటుందా అన్నదే ఇప్పుడు సమాధానం దొరకని ప్రశ్నలు.ఏం జరుగుతుందో చూడాలి.

 

author avatar
Yandamuri

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?